'భరత్ అనే నేను' మరియు 'మహర్షి' లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకొని మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో రిలీజ్ చేసిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. హ్యాట్రిక్ విజయం సాధించాలని బలంగా నమ్మి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కోసం సరికొత్తగా మాస్ తరహా పాత్రలో అదిరిపోయే డాన్స్ వేసి సరిలేరు నీకెవ్వరు తో సంక్రాంతికి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడు మహేష్. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి సంబంధించి సక్సెస్ సంబరాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

 

ముఖ్యంగా బాలీవుడ్ ఎంట్రీ గురించి ఊహించని కామెంట్ చేశారు మహేష్. తన కెరీర్లో ఎప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. ఒక్కసారి కాదు ఎన్నిసార్లు అడిగినా బాలీవుడ్ ఇండస్ట్రీ కి వెళ్లే ఆలోచన లేదని తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమకు లాభాలు వచ్చే విధంగా సినిమాలు చేస్తానని వెల్లడించారు.

 

అంతేకాకుండా తనకి టాలీవుడ్ ఇండస్ట్రీ లైఫ్ ఇచ్చిందని తన మూలాలను ఇక్కడే ఉన్నాయని తెలుగు ప్రజల ఆశీస్సులు తనకు బలమని చెప్పుకొచ్చిన మహేష్ బాబు ఒకవేళ తన సినిమాలు హిందీలోకి డబ్ అయి, రెండు చోట్ల ఏకకాలంలో విడుదలైతే తప్ప, ప్రత్యేకంగా హిందీలో సినిమాలు చేయనని తేల్చి చెప్పారు. పాన్ ఇండియన్ సినిమా అనే భావన కూడా సరికాదని, ఓ మంచి సినిమా మొదలుపెడితే భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా అది అన్ని ప్రాంతాలతో కనెక్ట్ అవుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి తన అభిమానులను అలరించే సినిమాలు చేస్తున్నట్లు ఊహించని కామెంట్స్ మహేష్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: