తెలంగాణ అచ్చ తెలుగు సుందరి ఈషా రెబ్బా.. 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'బందిపోటు, అమీతుమీ' లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. అంతే కాకుండా నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది. ఇకపోతే ఈ బ్యూటీ చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా అమ్మడి యాక్టింగ్‌కు మంచి గుర్తింపు లభించిందనే చేప్పాలి..

 

 

ఇదే కాకుండా ఈ బ్యూటీకి టాలీవుడ్లో సరైన పాత్రలు దక్కడం లేదనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. అంతే కాదు ఈ తెలంగాణ చిన్నదానికి ప్రస్తుతం ఆఫర్లు చాలా తక్కువే, ఇక హీరోయిన్‌గా కంటే సెకండ్ హీరోయిన్‌గా మాత్రం ఆఫర్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సోయగాల చిన్నదానికి బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్ధన్ కపూర్ నటించబోయే తాజా చిత్రంలో హీరోయిన్‌‌గా ఆఫర్ లభించిందట.

 

 

రాజ్ సింగ్ చౌదరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంతో బాలీవుడ్‌లో తన పాగా పక్కాగా వేయాలంటూ ఈషా రెబ్బా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ కావాలని ఈషా రెబ్బా కోరుకుంటోందట.. ఇకపోతే ఈ చిత్రం ఆడిషన్స్‌లో భాగంగా ఈషా రెబ్బా పర్ఫార్మెన్స్‌కు దర్శకనిర్మాతలు ఫిదా అయ్యి వెంటనే ఓకే చేశారట. అంతే కాకుండా తాను ఈ సినిమాలో ఓ రాజస్థానీ అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం.

 

 

ఈ కధకు తగ్గట్టుగా తన పాత్రను దర్శకుడు మలిచాడని, సరికొత్త కధతో వస్తున్న ఈ సినిమాతో తనకు గుర్తింపు వస్తుందని ఆశతో ఉన్న ఈషా పాప ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ కలిసి రాలేదని, బాలీవుడ్‌కు వెళ్లిన ఈషా ఈ సినిమాతో అయినా బాలీవుడ్‌లో తన స్దానాన్ని ఏ రేంజ్‌కు తీసుకెళ్లుతుందో, తర్వాత ఎన్ని ఆఫర్లు సంపాదించుకుంటుందో  వేచిచూడాలి అని అనుకుంటున్నారట కొందరు.  

మరింత సమాచారం తెలుసుకోండి: