నటసింహం నందమూరి బాలకృష్ణకు 2019వ సంవత్సరం అసలు ఏమాత్రం కలిసి రాలేదు. ఏడాది ప్రారంభంలో చేసిన తన తండ్రి బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు.. డిజాస్టర్లుగా మిగిలాయి. ఏడాది చివరలో చేసిన రూలర్ కూడా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే.. గెలుపోటములకు ఎప్పుడూ ప్రభావితం కాని బాలయ్య తన తర్వాతి ప్రాజెక్టును మాస్ డైరక్టర్ బోయపాటి శీనుతో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభమైంది కూడా. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతోంది. అయితే ఈ సినిమా విడుదల గురించి ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

 

 

ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలనేది దర్శక నిర్మాతల ఆలోచన. కానీ.. రెగ్యులర్ షూటింగ్ ఆలస్యం కావడంతో జూలైలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జూలై అంటే పర్లేదు కానీ.. అందరి మదిని తొలిచేస్తోంది మాత్రం రిలీజ్ చేయాలనుకుంటున్న డేట్. జూలై 30న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. జూలై 30వ తేదీ.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ఎన్టీఆర్ చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయాలనుకున్న డేట్. ఎన్నో అంచనాలతో వస్తున్న ఆ సినిమా విడుదల ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో బోయపాటి జూలై 30న తమ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడట.

 

 

అయితే.. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ప్రచారం జరుగుతోంది. వారెవరూ ఇంకా ఫైనల్ కాలేదు. బడ్జెట్ పరిమితులు చూస్తున్నారనే టాక్ వస్తోంది. వీటన్నింటినీ పరిశీలిస్తే సినిమా ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు పూర్తవుతుందో తెలీని పరిస్థితి. ఓపక్క బాలయ్య లుక్ కూడా మారుస్తున్నాడు. మరి.. సినిమా రిలీజ్ డేట్ పై వస్తున్న వార్తలకు సినిమా యూనిట్టే  స్పందించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: