సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ఒక హీరోతో సినిమా హిట్ అయ్యిందంటే ఆ హీరోకి తెగ అవకాశాలు వచ్చేస్తుంటాయి. అలాగే ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమాలో ఉంటే బాగుంటుందై వారు భావిస్తే, ఆ సినిమాలో అలాంటి పాత్ర లేకపోయినా కావాలని మరీ ఇరికిస్తారు. హీరోయిన్లకి వరుసగా అవకాశాలు వచ్చేది కూడా సెంటిమెంట్ మూలంగానే. పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు సైతం ఈ సెంటిమెంట్లని ఫాలో అవుతుంటారు.

 

త్రివిక్రమ్ శ్రీనివాస్.. చాలా వరకు తన సినిమాల పేర్లు ‘అ’తో మొదలయ్యేలా చూసుకుంటాడు. ఇంతకుముందు రాజమౌళి సినిమాల్లో హీరోయిన్ పేరు ఎక్కువ శాతం ఇందు అనే ఉండేది. నిన్నటికి నిన్న మహేష్ బాబు తన సినిమా కోసం ఏకంగా కొండారెడ్డి బురుజు సెట్టింగ్ వేసాడంటే అది కూడా ఒక సెంటిమెంటే.. ఇలా ఏ ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అయితే తాజాగా ఒక టాప్ దర్శకుడు కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయాడా అని అనిపిస్తుంది.

 

‘రంగస్థలం’తో భారీ విజయాన్నందుకున్న సుకుమార్ కి కూడా సెంటిమెంట్లపై గురి ఏర్పడినట్లుంది. బన్నీతో చేయబోయే తన తర్వాతి సినిమా విషయంలో ‘రంగస్థలం’ను ఆయన చాలా రకాలుగా ఫాలో అవుతున్నట్లుంది. దాని మాదిరే ఇదీ పీరియడ్ ఫిలిం. గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇందులోనూ థ్రిల్లర్ లక్షణాలున్నాయట. అలాగే హీరో లుక్ విషయంలోనూ రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య పోలికలుంటాయంటాయని అంటున్నారు.

 

అలాగే సినిమా పేరు విషయంలోనూ ఆ పోలిక కనిపిస్తుంది. ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. దీని సౌండింగ్ ‘రంగస్థలం’ను గుర్తు చేస్తోంది. అది కూడా ఒక ప్రాంతాన్ని సూచించేదే. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథ ఇదని.. అందుకే ఆ టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. మరి సినిమా రిలీజ్ అయితే ఈ సెంటిమెంట్ నిజమా కాదా అనేది చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: