విశాఖపట్నంలో అత్యంత ఘనంగా జరిగిన ‘అల వైకుంఠపురములో’ మూవీ సక్సస్ మీట్ లో అల్లు అర్జున్ భావోద్వేగంలో ప్రదర్శించిన నైరాశ్యం హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ సక్సస్ గురించి బన్నీ మాట్లాడుతూ ఈ రికార్డులు శాస్వితం కాదనీ అవి మారిపోతూనే ఉంటాయని కామెంట్ చేసాడు. 

అయితే తన అభిమానుల గుండెలలో తనకు ఏర్పడ్డ స్థానం మాత్రమే శాస్వితం అని చెపుతూ ఈ అభిమానాన్ని నిలుపుకోవడానికి తన జీవితాంతం నటిస్తూనే ఉంటాను అని అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. విశాఖ తనకు కంచుకోట లాంటిదని బన్నీ చెపుతూ ఈ సినిమా ఘన విజయంలో సహకరించిన తన అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ బన్నీ కొద్దిసేపు భావోద్వేగానికి లోనయ్యాడు. 

ఇక ఈ ఫంక్షన్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘అల’ మూవీలోని పాత్ర బన్నీ కోసమే పుట్టిందని ఆ పాత్రను ఒక్క బన్నీ తప్ప మరెవ్వరు చేయలేరు అంటూ బన్నీ అభిమానులకు జోష్ ను ఇచ్చాడు. విశాఖపట్నం పేరు వినగానే తనకు రావిశాస్త్రి శ్రీశ్రీ చలం లు తనకు గుర్తుకు వస్తారని అలాంటి వ్యక్తులు జీవించిన ప్రదేశంలో ‘అల’ మూవీ ఫంక్షన్ జరగడం తనకు ఆనందంగా ఉంది అంటూ కామెంట్ చేసారు. 

అంతేకాదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతిని మరొక స్థాయికి తీసుకు వెళ్ళగల స్థాయి బన్నీకి ఉంది అంటూ బన్నీ కాబోయే సూపర్ స్టార్ అన్న సంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు ఈ మూవీలో నటించిన ప్రతి పాత్రకు ఒక ప్రాధాన్యత ఉందని అందువల్లనే ఈ మూవీ ప్రేక్షకులకు ఈ స్థాయిలో కనెక్ట్ అయింది అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. సంక్రాంతి హడావిడి నిన్నటితో పూర్తిగా ముగిసి పోవడంతో నేడు సోమవారం ‘అల’ కు మొదటి పరీక్ష ఎదురౌతోంది. ఈరోజు ఈ సినిమాకు వచ్చే కలక్షన్స్ ను బట్టి ఈమూవీ ఏ రేంజ్ హిట్ గా మారే అవకాశం ఉంది అన్న విషయంలో క్లారిటీ వస్తుంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: