అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు-రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య సరిలేరు రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భాగానే ఉన్నాయి. మరీ నష్టాలు చూసే విధంగా అయితే కలెక్షన్స్ లేవని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫే అన్న మాట వినిపిస్తోంది. ఇది చాలా వరకు నిజమే అని కూడా అంటున్నారు. అయితే ఓవర్సీస్ లో మాత్రం సినిమా పెద్దగా వసూలు చేయలేకపోయిందని అంటున్నారు. నిజానికి ఓవర్సీస్ మార్కెట్ మహేష్ కు ముందు నుంచి గట్టిగా ఉందని చెప్పాలి. కానీ ఈ సారి మాత్రం మహేష్ యావరేజ్ కలెక్షన్స్ తో దెబ్బతిన్నాడని చెప్పుకుంటున్నారు. 

 

ఈ అదివారానికి యూఎస్ లో 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ $2.1 మిలియన్. సెకండ్ వీకెండ్ పూర్తయింది..ఇప్పటికే కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపిస్తోంది కాబట్టి ఫుల్ రన్ లో 2.5 మిలియన్ చేరుకోవడం కూడా కష్టమేనని.. ఈ సినిమాకు నష్టం తప్పేలా లేదని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయినప్పటికీ.. భారీ స్థాయిలో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేసినా.. మొదటి రోజు సోలో రిలీజ్ దక్కినప్పటికీ ఈ సినిమా నష్టాల బారిన పడటం అందరికి గట్టి షాక్ ఇస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా అల్ టైమ్ టాప్-10 కలెక్షన్స్ లిస్టులో కూడా స్థానం సంపాదించలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అయితే సంక్రాంతి పోటీలో రిలీజ్ అయిన 'అల వైకుంఠపురములో' మాత్రం ప్రస్తుతం టాప్ 10 లిస్టులో 7 వ స్థానంలో నిలిచింది. 

 

'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తోంది కాబట్టి ఫుల్ రన్ లో కూడా టాప్ 10 లిస్టులో చేరడం దాదాపు కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2 మిలియన్ కు పైగా కలెక్షన్స్ సాధించడం గొప్ప విషయమే. అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు కు ఓవర్సీస్ మంచి పేరుంది. అందుకే మహేష్ సినిమాలను భారీ రేట్ల కు అమ్ముతారు. అవి బ్రేక్ ఈవెన్ కావాలంటే భారీ స్థాయి కలెక్షన్స్ రాబట్టాలి. కానీ అలా జరగడం లేదు. మహేష్ ముందు నటించిన 'మహర్షి' సినిమా టార్గెట్ ని కూడా అందుకోలేక పోయింది. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. ఇలా కొనసాగితే మహేష్ కు ఓవర్సీస్ నెమ్మదిగా ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు. మరి తర్వాత సినిమాకైనా మహేష్ జాగ్రత్తగా ఉండాటా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: