జీవితం ఒక రణరంగం.. ఇక్కడ గెలవాలంటే నిత్యం పోరాడాలి. భయపడి ఒక్కడుగు వెనక్కు వేసామంటే ఎక్కడికో జారిపోతాం. అందుకే నిత్యం. ఎందరో బ్రతుకు సమరంలో నిలిచిన, కొందరు మాత్రమే ఈ జీవిత యుద్దంలో గెలుస్తారు. సమస్యలనే శత్రువులు, పరిస్దితులనే కాలనాగులు ఎప్పుడు వెంటే ఉంటాయి. ఇలాంటి ఎన్నో కష్టాలను అనుభవించిన ఈ నటి ఈ రోజు బాలీవుడ్ క్వీన్‌గా ఎదిగారు.. అయితే తాను కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న అనుభవాల గురించి కంగన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 

 

ఆ మాటలు వింటే కఠినాత్ములకు కూడా కన్నీళ్లు వస్తాయి.. ఇకపోతే 19 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కంగనా, చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్న సమయంలో, ఒకవేళ పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చినా అందులో రొమాంటిక్ సన్నివేశాల కోసం మాత్రమే తీసుకునేవారట. ఇటువంటి పరిస్దితుల్లో కంగనా అక్క రంగోలీపై యాసిడ్ ఎటాక్ జరిగిన సమయంలో, చేతిలో ట్రీట్‌మెంట్‌ చేపించడానికి కూడా డబ్బులు లేవట.. ఆ పరిస్దితుల్లో చేయకూడని చెత్త సినిమాలు కూడా చేసి వచ్చిన డబ్బుతో కంగనా అక్కకు 54 సర్జరీలు చేయించిందట..

 

 

ఆ వయసులోనే నేను పడని కష్టం అంటూ లేదు. బాధ పడుతూ ఏడ్చే సమయం కూడా ఉండేది కాదు. అలా చెత్త సినిమాలు చేస్తూ నరకంలో పడిపోయాను. చాలా మంది నా చేతకానితనాన్ని వాడుకున్నారు. తల్లిదండ్రులకు ఏమీ చెప్పుకోలేనని నన్ను లైంగికంగా వేధించారు. ఒక మనిషి ఎంత నరకం అనుభవిస్తాడో అవన్నీ నేను ఇక్కడే అనుభవించేశా. ఈ సంఘటలన్నీ నన్ను స్ట్రాంగ్‌గా మార్చాయి.

 

 

కానీ నా పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదు. వారికి మెరుగైన భవిష్యత్తును అందిస్తానని కన్నీళ్లతో పేర్కొన్నారు కంగనా... ప్రస్తుతం కంగనా రనౌత్ బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే ఏకైక కథానాయిక నిలిచింది.. అంతే కాకుండా ఆమె ఖాతాలో మూడు జాతీయ అవార్డులు కూడా ఉన్నాయి... గొంగళి పురుగు లాంటి బ్రతుకు నుండి సీతాకోక చిలుకలా మార్చుకున్న ఈమె జీవితం ఒకరకంగా కొందరికి ఆదర్శమే..

మరింత సమాచారం తెలుసుకోండి: