యువకునిగా ఉన్నవారు తాము ముసలివాళ్ళు అయ్యాక ఎలా ఉంటారో చూసుకోవడానికి ఒకప్పుడు వీలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం యువకుడిగా ఉన్నప్పుడే ముసలివాళ్ళు అయ్యాక మనం ఎలా ఉంటామో చూసుకోవడానికి ఆన్లైన్లో ఎన్నో యాప్స్  వచ్చాయి. ప్రస్తుతం ఆన్లైన్ యాప్స్   ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో సరికొత్త యాప్స్  తీసుకువచ్చి నెటిజన్లను ఆకర్షించేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే యువకులుగా ఉన్నవారిని ముసలి వాళ్ళ చూపించేందుకు ఓ సరికొత్త యాప్ ఆన్ లైన్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ యాప్ పేరు ఫేస్ యాప్. దీనిద్వారా ద్వారా యువకులు తాము ముసలి వాళ్ళం అయిన తర్వాత ఎలా ఉంటారో  చూసుకోవచ్చు. 

 


 ఇది భారతదేశంలో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. అంతకు మునుపెన్నడూ ఇలాంటి యాప్  తెరమీదికి రాకపోవడం... నెటిజన్లతో పాటు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా తాము ముసలి వాళ్ళం అయిన తర్వాత  ఎలా ఉంటామో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపారు . సెలబ్రిటీలు ఈ యాప్ ద్వారా తాము ముసలి వాళ్ళం అయిన తర్వాత ఎలా ఉంటామో  చూసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. ఇక తాజాగా ఈ ఫేస్ యాప్ ని మెగా హీరోలు ఉపయోగించి ఓల్డ్ లుక్కుతో అభిమానులందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫేస్ యాప్ ను  మెగా హీరోలు కూడా ఓసారి ట్రై చేసి చూసి ఆశ్చర్యపోయారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మెగా  ప్రిన్స్  వరుణ్ తేజ్ .. ఫేస్ యాప్ ను ట్రై చేసి ముసలివాళ్ళు అయ్యాక  ఎలా ఉంటాను ఒక్కోసారి చూసుకున్నారు. 

 

 పేస్ యాప్  ద్వారా తమ ఫొటోలను ముసలి వాళ్ళలా  మార్చేసి వరుణ్ తేజ్ బర్త్ డే  సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తున్నది . ఇక ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షించేస్తుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు అందరూ లుక్ సూపర్ గా ఉంది హాలీవుడ్ హీరో లాగా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే  గతంలో ఒక్కసారిగా ఫేమస్ ఐన ఈ పేస్  యాప్ ద్వారా మొబైల్ నుంచి పర్సనల్ డాటా  సీక్రెట్గా లీక్ అవుతుందని తెరమీదకి కొన్ని వార్తలు రావడంతో ఈ యాప్  చాలామంది ఉపయోగించడం మానివేసిన విషయం తెలిసిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Happy birthday @varunkonidela7 !! Enjoy getting old😉!!

A post shared by ram Charan (@alwaysramcharan) on

మరింత సమాచారం తెలుసుకోండి: