నందినిరెడ్డి పేరు తెలియని వారుండరు. ఎందుకంటే టాలీవుడ్‌లో ఉన్న లేడీ దర్శకుల్లో నందిని రెడ్ది ఒకరు. ఇకపోతే ఆమే చేసిన సినిమాలను ఒక సారి పరిశీలిస్తే చూడచక్కగా ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇక ఈ మద్యకాలంలో నందినిరెడ్డి డైరెక్షన్‌లో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా ఆల్ సెంటర్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే..

 

 

ఇక ఈమె చేసే నెక్స్ట్ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి. ఇదిలా ఉండగా నందిని రెడ్డి ‘ఓ బేబీ’ చిత్రీకరణ సమయంలోనే వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం నందిని ,వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తుండగా, దానికి సంబంధించిన పూర్తి వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయట.

 

 

ఇకపోతే నందిని తాను తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పైనే వర్క్ పైనే దృష్టి పెట్టారు. కాగా ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ నిర్మిస్తుండగా, ‘మహానటి మరియు ఓ బేబీ’ సినిమాలకు సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి కూడా స్వరాల్ని అందిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో నాని హీరోగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయని, సినీ వర్గాల సమాచారం.

 

 

అయితే నానితో ఇదివరకు నందిని రెడ్ది అలా మొదలైంది సినిమా చేసింది. ఈ మూవీ పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ అందిస్తుండగా, మిగతా తారగణాన్ని త్వరలోనే వెల్లడిస్తారట. ఇక ఈ సినిమాతో నందిని రెడ్ది, నాని, బిగ్ హిట్టును తన ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తున్నారు నాని అభిమానులు..  

మరింత సమాచారం తెలుసుకోండి: