మాస్ మహారాజ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సైన్స్ ఫిక్షన్ మూవీ డిస్కో రాజా. ఇప్పటికే కొన్నాళ్లుగా వరుసగా అపజయాలతో సతమతం అవుతున్న మాస్ రాజా రవితేజ ఈ సినిమాపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి సైన్స్ ఫిక్షన్ జానర్ లో సినిమాలు తీసిన ఆనంద్, ఆ సినిమాలతో బాగానే పేరు సంపాదించాడు. ఇక ఈ సినిమాను కూడా ప్రస్తుతం అదే జానర్ లో తీస్తుండడంతో ఇది కూడా మంచి సక్సెస్ సాదిస్తుందని రవితేజ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నభ నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, రామ్ తాళ్లూరి తన ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

 

ఇకపోతే నిన్న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్ దక్కించుకున్న ఈ సినిమాపై సెన్సార్ బోర్డు మంచి ప్రశంసలు కురిపించినట్లు టాక్. డిఫరెంట్ జానర్లో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూడాలి అని భావించేవారికి ఈ సినిమా నచ్చుతుందని అంటున్నారు. చాలా వరకు సినిమా ఎంతో క్లీన్ గా ఉన్నప్పటికీ, మధ్యలో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ వలన సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందట. ముందుగా మంచి కాన్సెప్ట్ తో ప్రారంభం అయ్యే ఈ సినిమా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ జానర్ లో సాగుతుందని, 

 

ఇక ఇంటర్వెల్ లో వచ్చే అద్భుతమైన ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇక ఒకింత మెల్లగా ఆరంభం అయిన సెకండ్ హాఫ్, కొద్ధి కొద్దిగా సినిమాని ప్రేక్షకుడికి కనెక్టు చేస్తుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్, థ్రిల్లింగ్ సీన్స్ తో పాటు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఎంతో బాగుందని, ఓవరాల్ గా ఎబోవ్ యావరేజ్ నుండి హిట్ దిశగా ఈ సినిమా టాక్ ని రాబట్టే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలంటే, మరొక్క మూడు రోజులు అనగా ఈనెల 24న ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఓపిక పట్టాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: