టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రెండు రోజులుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడ్డట్లు టాక్ వస్తున్నప్పటికీ ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం ఇప్పటివరకు ఈ విషయమై ఎటువంటి ప్రకటన వెలువరించలేదు. 

 

అయితే ఆర్ఆర్ఆర్ వాయిదా పడనున్న నేపథ్యంలో మే తరువాత తన షూటింగ్ పార్ట్ పూర్తి కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో తదుపరి ఒక సినిమా తెరకెక్కనున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా మంచి సక్సెస్ సాధించినప్పటికీ, అది పూర్తి స్థాయి యాక్షన్, మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అయితే ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తెరకెక్కించిన అలవైకుంఠపురములో సినిమా మంచి ఫ్యామిలీ, ఎంటర్టైనర్ గా పేరు దక్కించుకుని ముందుకు సాగుతుండడంతో, 

 

తమ హీరోకు కూడా నెక్స్ట్ త్రివిక్రమ్ అటువంటి కమర్షియల్ ఎంటర్టైనర్ నే ఇవ్వాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తూ కోరుతున్నారు. నిజానికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ ని స్వామి అని సంబోధిస్తుంటారు అనే విషయం తెలిసిందే. 'మాకు కూడా 'అల' మాదిరి పక్కా ఎంటర్టైనర్ కావాలి స్వామి' అంటూ సరదాగా త్రివిక్రమ్ ని ఉద్దేశించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ ఎంతో వైరల్ అవుతున్నాయి. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ ని ఎంతవరకు సీరియస్ గా తీసుకుని స్వామి (త్రివిక్రమ్) ఆయనకు నెక్స్ట్ టైం ఏ రేంజ్ ఎంటర్టైనర్ ఇస్తారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: