సినిమా విడుదల అయింది అంటే ఆ సినిమా హిరో ను బట్టి సినిమా ప్రమోషన్ రేంజు పెరుగుతుంది. అందుకే సినిమా వస్తుంది అంటే ముందు నుండే హడావిడి కూడా ఎక్కువే.. ఒక సినిమా షూటింగ్ అన్నారు. అది పవర్ స్టార్ లాంటి పెద్ద హీరోల సినిమా వస్తుంది అంటే ఇంకా చెప్పనక్కరలేదు..సినిమా కోసం పడి చచ్చిపోయే ఫ్యాన్స్ కూడా ఉన్నారు..

 

ఇది ఇలా ఉండగా చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండి ఇప్పుడే రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల సంగతి అంటుంచితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో పూనకం అనే చెప్పాలి. ఆయన బొమ్మ థియేటర్స్‌లో పడుతుంది అంటే ఉండే హంగామా మామూలుగా ఉండదు. ఆయన సినిమాకి క్లాప్ కొట్టింది మొదలు.. ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్, రిలీజ్, రికార్డ్స్ ఇలా ప్రతిదీ ఓ సంచలనమే. ఆయన అట్టర్ ఫ్లాప్ సినిమాకి తొలిరోజు తిరుగులేని కలెక్షన్స్ వస్తాయంటే పవన్ క్రేజ్ ఏం రేంజ్‌లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

 

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని సెగలు రేగుతుంటే... మరోవైపు పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ మూవీ ఫొటోలు వైరల్ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26 మూవీ షూటింగ్ మొదలైంది.. లాయర్ సాబ్  ఆన్ డ్యూటీ అంటూ పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌లో ఉన్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గుబురు గడ్డంతో బ్లాక్ అండ్  బ్లాక్ డ్రెస్ లో నడుచుకుంటూ వస్తున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..మామూలుగానే పవన్ కళ్యాణ్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి.. ఆయన సినిమాల్లోకి రావాలని చాలా మంది అనుకున్నారు.. అందుకు ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: