ఈ మధ్య కాలంలో సినిమాలు డబ్బులకోసం మరింత ఎక్కువగా రెచ్చిపోతున్నాయి.. సినిమా హిట్ అవ్వాలంటే ఏదోక మసాలా ఉండాలని లేకుంటే కొత్తగా ఎదైనా ట్రై చేయడం లాంటివి చేస్తూ వస్తున్నారు.. అలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటే వాటి హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది.. ఒక బోల్డ్ సినిమా నో లేఖ హడల్డ్ సినిమా నో వస్తుందంటే సినిమాలో మెయిన్ హైలెట్ అవుతుందని అనేది మాత్రమే చాలా సార్లు చూపిస్తారు..

 

 

లవ్‌స్టోరీ అనగానే అమ్మాయి, అబ్బాయే గుర్తుకొస్తారు. కానీ ఇద్దరు అమ్మాయిల మధ్య, ఇద్దరు అబ్బాయిల మధ్య పుట్టే ప్రేమను మాత్రం సమాజం అంగీకరించదు. అదేదో ప్రకృతికి విరుద్ధం అన్నట్లుగా చూస్తారు. కానీ సుప్రీంకోర్టు ఈ విషయంలో సానుకూలంగా తీర్పునివ్వడంతో ఇప్పుడిప్పుడే సమాజం స్వలింగ సంపర్కుల ప్రేమ కూడా సాధారణమైనదేనని అర్థం చేసుకుంటోంది. ఇప్పుడు ఈ అంశంపై తెరకెక్కిన ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమా పేరు ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’. హితేష్ కేవల్య డైరెక్ట్ చేశారు. 

 

 

ఈసినిమాలో ఆయుష్మాన్ ఖురానా ఓ స్వలింగ సంపర్కుడు. ఇతను జితేంద్ర కుమార్ (అమన్)ను చూసి ప్రేమలో పడతాడు. ఇది చాలా తప్పు అని ఇరు వైపుల కుటుంబాలు ఎంత చెప్పినా వీరు మాత్రం వినరు. చివరికి ఏమైంది అనేది తెరపై చూడాలి. ట్రైలర్‌లో ఆయుష్మాన్ ఖురానా, జితేంద్ర కుమార్ లిప్ లాక్ చేసుకున్న సన్నివేశం హైలైట్‌గా నిలిచింది. 2017లో వచ్చిన ‘శుభ్ మంగళ్ సావధాన్’ సినిమాకు ఈ సినిమా సీక్వెల్‌గా రాబోతోంది. కలర్ యెల్లో ప్రొడక్షన్స్, టీ సిరీస్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న సినిమా ప్రేక్షుకల ముందుకు రాబోతోంది.

 

 

సమాజంలో కొత్తగా జరిగేవి ఏవి ఉన్నా కూడా కళ్ళకు కట్టినట్లు చూపించారు.. అలా ఒక్కోసారి వాటి గురించి చూపించడంలో ఆయిస్మాన్ ముందుంటాడు.. లెస్బియన్ లేదా ఓ రకమైన ఆకర్షణ తో ఉన్న ఇద్దరు మగాళ్లు ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం.. రీసెంట్ గా విడుదలయిన ఈ సినిమా ట్రెయిలర్ ప్రేక్షకులను మరింత అకట్టుకుంది.. మరి సినిమా ఏ రేంజులో ఉంటుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: