విజయ్ దేవర కొండ పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు.  ఆ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.  డీసెంట్ హిట్ కొట్టిన విజయ్ ఆ తరువాత చేసిన అర్జున్ రెడ్డి సినిమా ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో చెప్పక్కర్లేదు.  ఈ సినిమాను అనేక భాషల్లో రీమేక్ చేశారు.  అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ అటు బాలీవుడ్ కు కూడా చేరువయ్యాడు.  


అయితే, ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ చేసిన గీత గోవిందం సినిమా బాగా ఆడింది.  వంద కోట్లు కలెక్ట్ చేసింది. విజయ్ హీరోగా చేసిన మూడో సినిమానే ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషం. ఇకపోతే, యూనివర్సల్ సబ్జెట్ తో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది.  అయితే, సౌత్ లో ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాలేదు.  కానీ, బాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది.  


ఇదే సినిమాను డిజిటల్లో అంటే యూట్యూబ్ లో డబ్బింగ్ చేసి హిందీలో రిలీజ్ చేశారు.  ఇలా యూట్యూబ్ లో రిలీజయిన 24 గంటల్లోనే ఈ మూవీ 12 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డు దిశగా పరుగులు తీస్తున్నది.  24 గంటల్లోనే ఈ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటే, వారం రోజుల్లోనే ఈ మూవీ వంద మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.  సినిమాకు క్రేజ్ పెరిగిపోతుండటంతో సినిమాకు ఆదరణ పెరుగుతున్నది.  


ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది.  దీనిని తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, హిందీ వెర్షన్స్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.  పూరి సినిమా అంటే హిందీ ప్రేక్షకులు బాగా లైక్ చేస్తుంటారు.  అయన తీసిన చాలా సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి.  ఫైటర్ సినిమాను పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో ఈ మూవీతో విజయ్ బాలీవుడ్ లో పెద్ద స్టార్ కావడం  ఖాయం అని అంటున్నారు.  మరి చూద్దాం ఏమౌతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: