పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్.. పూరి జగన్నాథ్ మరియు చార్మిలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లాంఛనంగా నిన్ననే ప్రారంభమైంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరి... ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ సినిమాగా తీర్చి దిద్దనున్నాడు. ఈ మేరకు బాలీవుడ్ దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ తో కలిసి ఈ సినిమా నిర్మాణం జరగనుంది.

 

బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పేరు ఫైటర్ గా నిర్ణయించారు. అయితే ఫైటర్ అనే పేరు కరణ్ జోహార్ కి నచ్చలేదట. చాలా సాధారణంగా ఉండడంతో టైటిల్ మార్చాలని కరణ్ చెప్పాడట. పాన్ ఇండియాలో రేంజ్ లో తెరకెక్కించాలంటే ఈ టైటిల్ సరిపోదని.. కబాలి, సాహో లాంటి విభిన్నత కలిగిన టైటిల్ కావాలని చెప్పాడట. బాలీవుడ్ లో ఈ సినిమాని మార్కెట్ చేసే బాధ్యత తాను తీసుకుంటానని, కానీ టైటిల్ మాత్రం మార్చమని సలహా ఇచ్చాడట.

 

దీం త్ఫ్ ఆలోచనలో పడ్డాడట పూరి. ఏదైనా పాన్‌ ఇండియాకి అప్పీల్‌ అయ్యేలా ఉండే టైటిల్ కోసం ఆలోచిస్తున్నాడట. ఈ చిత్రం షూటింగ్  దాదాపుగా ముంబయి, గోవాలోనే జరుగుతుంది కనుక కరణ్‌ జోహార్‌ టీమ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తుందట. విజయ్ దేవరకొండ మొదటి సారిగా చేస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా బాలీవుడ్ లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ ని ఉపయోగించుకుని పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు.

 

సినిమా కనక హిట్ అయితే పూరి జగన్నాథ్ తర్వాతి సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే అవకాశం ఉంది. అప్పుడు స్టార్ హీరోలు సైతం పూరి కోసం ఎగబడి వస్తారనడంలో సందేహం లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: