తెలుగు లో నిప్పురవ్వ, గ్యాంగ్ వార్, గాడ్ ఫాదర్, చిలక్కోట్టుడు, మా ఆయన బంగారం లాంటి సినిమాల్లో నటించి తన అందచందాలతో మురిపించిన నటి కస్తూరి.  ఆ తర్వాత తమిళ, కన్నడ, మళియాళ భాషల్లో నటించింది. నాగార్జున నటించిన ‘అన్నమయ్య’ లో కస్తూరికి మంచి గుర్తింపు వచ్చింది.  కొంత కాలంగా ఈ అమ్మడు సినిమాలకు దూరం అయ్యింది.  ఆ మద్య కన్నడంలో వచ్చే బిగ్ బాస్ లో పాల్గొంది.  తాజాగా కస్తూరి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.  తమిళ సూపర్ స్టార్ అజిత్ ఫ్యాన్ కస్తూరిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలకు తిరిగి సమాధానం ఇచ్చింది.

 

ఇలా అజిత్ అభిమాని అని చెప్పుకుంటూ ఆడవాళ్లపై నీచమైన కామెంట్స్ చేసే వెధవలని ఏం చేయాలి? మీకు అమ్మాయిని చూడగానే సెక్స్ మాత్రమే గుర్తుకు వస్తే బయటికి వెళ్లే బదులు మీ అమ్మ దగ్గరికో లేక సోదరి దగ్గరికో వెళ్లండి’ అని ఘాటుగా స్పందించారు. అంతే కాదు ఇలాంటి ఆడవాళ్లపై సెక్సిస్ట్ కామెంట్స్ చేసేవారిపై ట్విటర్ చర్యలు తీసుకోవాలని కోరారు.  అజిత్ అభిమానులు ఆడవాళ్లపై దరిద్రమైన కామెంట్స్ చేస్తూ పాపులర్ అవడం. తప్పు చేస్తున్న వారిని అదుపుచేయాల్సిందిపోయి వారితో చేతులు కలిపిన మీరు ఎంతకు దిగజారిపోయారో అర్థమవుతోంది హీరోపై కూడా దారుణమైన కామెంట్స్ చేసింది.

 

అంతే ఇక అజిత్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ  అభిమాన  హీరోను  అవమానించేలా  మాట్లాడావని కొన్ని రోజులుగా కస్తూరిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వారి బ్యాడ్ కామెంట్స్ పై ఎప్పటికప్పుడు  కస్తూరి స్పందిస్తూనే ఉంది.  తాజాగా ఆమెను మరోసారి టార్గెట్ చేసి నీవు చేసేలా మా అమ్మ.. చెల్లి ప్రవర్తించడం లేదు.. నీకు వారితో పోలిక ఏంటీ అంటూ మరింతగా రెచ్చి పోతున్నారు. అలాంటి కామెంట్స్ చేసే వారిని పట్టించుకోకుండా ఉండటం మంచిదని కొందరు కస్తూరికి  సలహా ఇస్తున్నారు. మరి కస్తూరి రిక్వస్ట్ కు స్పందించి అజిత్, షాలినిలు ఈ ఘటనని ఖండిస్తారో లేదో చూడాలి. ఇతర హీరోల అభిమాను... గొడవలు జరిగినప్పుడు తనకు, తన అభిమాన సంఘాలకు ఎలాంటి సంబంధం లేదని అజిత్ తేల్చేశాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: