సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు నిన్న తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల షేర్ ను రాబట్టడంతో 10రోజుల్లో ఈ చిత్రం అక్కడ 101.97 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. తద్వారా వేగంగా 100కోట్ల మార్క్ ను  చేరుకున్న రెండో సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు బాహుబలి , బాహుబలి 2 తరువాత ఏపీ&తెలంగాణ లో 100కోట్ల వసూళ్లను రాబట్టిన మూడో సినిమా కూడా సరిలేరు నీకెవ్వరు కావడం విశేషం.  ఇక ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం నెమ్మదించింది దాంతో ఇప్పటివరకు  అక్కడ 2మిలియన్ డాలర్ల వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. 
 
సరిలేరు 10రోజుల వసూళ్ల వివరాలు : 
 
నైజాం -33కోట్లు                                                                           
సీడెడ్ - 14.65 కోట్లు          
ఉత్తరాంద్ర - 1707 కోట్లు 
గుంటూరు -9.03 కోట్లు 
తూర్పు గోదావరి - 10.06 కోట్లు 
పశ్చిమ గోదావరి - 6.57 కోట్లు '
కృష్ణా - 7.97 కోట్లు 
నెల్లూరు - 3.62 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10రోజులకు గాను షేర్ = 101.97 కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: