అల వైకుంఠపురంలో చిత్రానికి సంక్రాంతి సీజన్ అద్భుతంగా కలిసొచ్చింది. ఫెస్టివల్ మూడ్ కు తగ్గ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో అల వైకుంఠపురంలో సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డ్ కలెక్షన్లను నమోదు చేస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ లో సాంగ్స్ కు మేజర్ పార్ట్ దక్కుతుందనే చెప్పాలి. 

 

అల వైకుంఠపురంలో సినిమా ఊహించిన దానికంటే మించి బాక్సాఫీస్ వద్ద సర్ ప్రైజ్ చేస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు వన్ డే గ్యాప్ తో వచ్చిన అల వైకుంఠపురంలో క్లీన్ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు విజేతగా నిలిచిందనే చెప్పాలి. 

 

అల వైకుంఠపురంలో సక్సెస్ లో మేజర్ క్రెడిట్ అంతా తమన్ మ్యూజిక్ కే దక్కుతోందని చెప్పాలి. సాధారణమైన కథకు అద్భుతమైన పాటలు కుదిరితే సినిమా ఏ రేంజ్ కు వెళుతుందనే దానికి అల వైకుంఠపురంలో నిరూపించింది. త్రివిక్రమ్ స్టైలీష్ టేకింగ్, అల్లు అర్జున్ సెటిల్డ్ పెర్ఫామెన్స్, మురళి శర్మ పాత్ర, పూజా హెగ్డే గ్లామర్ అల వైకుంఠపురంలో సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. ఈ సినిమాలోని యాక్టర్స్ పర్ఫామెన్స్ ఒకెత్తు అయితే సంగీతం మరో స్థాయి అని చెప్పాలి. 


వరల్డ్ వైడ్ గా 88కోట్ల బిజినెస్ చేసిన అల వైకుంఠపురంలో ఆరు రోజుల్లోనే 124కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లుతోంది. 81కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చేసింది. మరో 7కోట్లు వసూలు చేస్తే అల వైకుంఠపురంలో లాభాల బాటపట్టినట్టే. థియేటర్స్ వద్ద ఈ చిత్రం ఊపు చూస్తుంటే ఈజీగా వందకోట్ల షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

 

నైజాం, సీడెడ్, ఈస్ట్, వెస్ట్ ఇలా అన్ని ఏరియాస్ లో అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధిస్తోంది. ఓవర్సీస్ లో 13కోట్లకు అమ్ముడయిన ఈ సినిమా ఆరు రోజుల్లోనే 9కోట్లను వసూలు చేయడం విశేషం. త్రివిక్రమ్ నేరేషన్ స్లోగా ఉన్న అల్జు అర్జున్ పెర్ఫామెన్స్, డ్యాన్స్ లు ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఈ సంక్రాంతి విజేత బన్ని అనేది అల వైకుంఠపురంలో బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: