బాక్సాఫీస్ ను శాసించిన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత మేకప్ వేసుకున్నాడు. పవర్ స్టార్ రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే అందరికీ శుభవార్త అందింది. హీందీ హిట్ పింక్ రీమేక్ లో నటిస్తున్న పవన్.. సోమవారం నాడు షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. 


పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ గురించి రకరకాలుగా వార్తలొచ్చాయి. చాలామంది దర్శకులు తెరపైకి వచ్చినా. ఫైనల్ గా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ తో రీఎంట్రీ ఇచ్చాడు పవన్. నానీతో ఎంసీఏ మూవీ తీసిన వేణు శ్రీరాం దర్శకత్వంలో బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనుకొని చాలాకాలం అయినా.. ఇన్నాళ్లకు సెట్స్ పైకి వచ్చింది. 

 

పింక్ రీమేక్ షూటింగ్ నగర శివారులో మొదలైంది. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో పవన్ తో పాటు ముఖ్య తారాగణం పాల్గొంటారు. ఒరిజినల్ వెర్షన్ లో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. తాప్సీ రోల్ ను నివేద థామస్ పోషిస్తోంది. అనన్య నాగళ్ల, అంజలి ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమాతో తమన్ ఫస్ట్ టైమ్ పవన్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. 


పవన్ సినిమా సెట్స్ పైకి రావడమే ఆలస్యం.. సమ్మర్ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. వేసవి సెలవులు క్యాష్ చేసుకునేలా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. మెగా హీరోలందరితో సినిమాలు తీసిన దిల్ రాజు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మిస్తూ.. ఆ వెలితిని భర్తీ చేసేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కొత్త సినిమాపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ సినిమాలో పవన్ తన ఫ్యాన్స్ ను ఎలా ఉర్రూతలూగిస్తాడో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: