టాలీవుడ్ లో కొంత కాలంగా బాలీవుడ్ బ్యూటీలు వరుసగా క్యూ కడుతున్నారు. ఇందులో సక్సెస్ అయిన వారు కొంత కాలం హీరోయిన్లుగా.. సెకండ్ హీరోయిన్లుగా రాణిస్తుంటే.. మరికొంత మంది ఐటమ్ సాంగ్స్ కి పరిమితం అవుతున్నారు. 2008లో హిందీ హారర్ సినిమా 1920తో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆదా శర్మ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చుకోలేదు. ఆ మద్య అడవిశేషు హీరోగా నటించిన ‘క్షణం’ మూవీ మంచి హిట్ అయినా.. ఈ బ్యూటీకి కలిసి రాలేదు.
తర్వాత సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. కానీ, బాలీవుడ్ లో మాత్రం వరసగా సినిమాలు చేస్తున్నది. బాలీవుడ్ లో ఈ అమ్మడు కమాండో 3 అనే సినిమా చేస్తున్నది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ..హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్లు చేస్తూ.. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు మతిపోయేలా చేస్తోంది. అంతే కాదు మార్షల్ ఆర్ట్స్ లో ఇప్పటికే పట్టభద్రురాలైన ఆదా శర్మ తాజాగా నాన్ చాక్, కర్రసాము వంటివి కూడా నేర్చుకుంటోంది.
అదే విధంగా డ్యాన్స్ లోను మంచి ప్రవేశం ఉన్నది. కథక్ లో ఇప్పటీకే డిగ్రీ చేసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. అవకాశం వస్తే చాలు..రెచ్చిపోయి ఫోటో షూట్లు చేస్తూ.. తన అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఆ మద్య ఆదా శర్మ ఓ వ్యాపార వేత్తతో డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియడం లేదు. అయితే దీనిపై స్పందించిన ఈ అమ్మడు తనకు అంత టైమ్ లేదు... అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఏది ఏమైనా ఈ అందాల ఆరబోత సినిమా ఛాన్సుల కోసమేనా.. అంటూ నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు