సంక్రాంతి కి రిలీజైన నాలుగు సినిమాలలో రజనీ దర్బార్ గురించి గాని కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా సినిమా గురించి గాని జనాలు ఎప్పుడో మర్చిపోయారు. ఇక మిగిలింది సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో. ఈ రెండు సినిమాల హిట్టా, సూపర్ హిట్టా అన్న విషయం పక్కన పెడితే వచ్చిన ఇంకా వస్తున్న ఫేక్ కలెక్షన్స్ పై నానా రచ్చ జరుగుతోంది. ఇందులో ఒకరు తప్పు.. మరొకరు ఒప్పు అని చెప్పడం కూడా కష్టం గానే ఉంది. ఎందుకంటే ఒకరికోకు పోటీ పడి మరీ మా కలెక్షన్స్ ఇంతా అంటే మా కలెక్షన్స్ ఇంతా అని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. వాస్తవంగా 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ మాత్రం కలెక్షన్స్ విషయంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ వాస్తవాన్ని ఒప్పుకోకుండా.. కిందపడ్డా మాదే పైచేయి అంటూ ఈ ఫేక్ గేమ్ ను పీక్స్ కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నిజం నిప్పు లాంటిది. కాబట్టి అబద్ధం చెప్పిన తర్వాత ఎక్కడో ఒక చోట దొరక్కపోరు కదా.. అలానే సరిలేరు టీమ్ దొరికిపోయిందని తెలుస్తోంది.

 

'సరిలేరు నీకెవ్వరు' టీమ్ తమ సినిమా రూ.200+ కోట్ల గ్రాస్ సాధించింది అంటూ అధికారికంగా పోస్టర్లు రిలీజ్ చేశారు.  సోషల్ మీడియాలో ఓ అంటూ ఊదరగొట్టారు. అక్కడితో ఆగకుండా మధ్యాహ్నానికి 'మహేష్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్' అంటూ ఇంకో పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే  ఇందులో నంబర్ ఇవ్వలేదు. నంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ సినిమాకు మహేష్ గతంలో బెస్ట్ కలెక్షన్స్ వసూలు చసిన సినిమా కంటే కలెక్షన్స్ ఎక్కువగా వచ్చి ఉండాలి. అయితే గతంలో మహేష్ సినిమా 'భరత్ అనే నేను' 50 రోజుల పోస్టర్లో ఏడు వారాల వరల్డ్ వైడ్ గ్రాస్ 232.68 కోట్లు అంటూ ఘనంగా ప్రకటించుకున్నారు. ఈలెక్కన 'సరిలేరు నీకెవ్వరు' ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు ఈ 30+ కోట్లు వసూలు చేసి ఉండాలి. ఇదెలా సాధ్యం.. అంటూ నెటిజన్లు 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ పై ఫేక్ కలెక్షన్ల ప్రచారం చేస్తున్నారు అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

 

ఒకవేళ సరిలేరు మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నిజం అయితే కొరటాల శివ-మహేష్ బాబుల 'భరత్ అనే నేను' కలెక్షన్లు ఫేక్ అయి ఉండాలి. ఈ రకంగా చూస్తే ఇప్పుడు రెండిటిలో ఒకటే నిజం. ఈ కలెక్షన్స్ మాయలో పడి సింపుల్ లాజిక్కులు గాలికి వదిలేస్తున్నారు. పోస్టర్లలో జనాలని మాయచేయడానికి తప్పుడు లెక్కలు వేసుకునే ముందు.. గతంలో మహేష్ సినిమాలకు వచ్చిన కలెక్షన్లను గమనించుకోకపోతే ఇలానే ఉంటుందని సరిలేరు టీం మీద సెటైర్లు పడుతున్నాయి. కనీసం గూగుల్ లో ఈ పోస్టర్లు పర్మనెంట్ గా ఉంటాయనే లాజిక్ మిస్ అయితే ఎలా అండీ కాస్త చూసుకోవద్దూ ..! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: