ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇప్పటికే 75శాతం వరకు పూర్తయింది.  మిగతా కొంత షూటింగ్ జరుగుతున్నది.  వికారాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  వికారాబాద్ లో రామ్ చరణ్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు.  చరణ్ తో పాటుగా, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఉన్న సీన్స్ కూడా షూట్ చేస్తున్నారు.  


అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా ఉన్నారు.  నిన్నటి రోజున అయన షూటింగ్ స్పాట్ కు వచ్చిన సంగతి తెలిసిందే.  షూటింగ్ స్పాట్ కు వచ్చిన తరువాత, దర్శకుడు రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.  ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 అయితే, అజయ్ పాత్ర ఏంటి అన్నది మాత్రం రివీల్ కాలేదు.  
కానీ, సోషల్ మీడియాలో అయన పాత్ర గురించిన వివరాలు ట్రెండ్ అవుతున్నాయి.  అజయ్ దేవగణ్ ఈ మూవీలో భగత్ సింగ్ పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది.  ఈయన స్ఫూర్తితోనే అటు అల్లూరి సీతారామ రాజు, ఇటు కొమరం భీం లు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని చూపించబోతున్నారట.  అజయ్ రీసెంట్ గా చేసిన తానాజీ సినిమాలో తానాజీగా ఆకట్టుకున్నాడు.  సినిమా భారీ విజయం సాధించింది.  


కాగా, ఇదే విధంగా భగత్ సింగ్ పాత్రలో అజయ్ దేవగణ్ మెప్పించబోతున్నారని తెలుస్తోంది.  ఇది ఎంతవరకు నిజం అనే విషయం తెలియాల్సి ఉన్నది.  అజయ్ పాత్ర ఇది అని ఇప్పటి వరకు యూనిట్ రివీల్ చేయలేదు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల గురించి మాత్రమే రివీల్ చేశారు. ఈ సినిమా టైటిల్ కూడా ఇప్పటి వరకు ప్రకటించకపోవడం విశేషం.  తాజా సమాచారం ప్రకారం ఈనెల 26 వ తేదీన ఈ సినిమా గురించి న్యూస్ ఒకటి బయటకు వస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: