గత ఏడాది సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం కామెడీ ఎంట్రటైన్ మెంట్ గా తెరకెక్కిన  ఈ మూవీ మంచి శుభారంభం పలికింది.  అయితే ఈ మూవీకి సీక్వెల్ గా ఎఫ్ 3 ఉండబోతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు’ మంచి విజయం అందుకుంది. 

 

ఇక ఎఫ్ 3 మూవీ సీక్వెల్‌లో వెంక‌టేశ్‌, వ‌రుణ్ న‌టిస్తామ‌ని కూడా తెలిపారు. కాకపోతే హీరోయిన్స్ విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.  తాజాగా సమాచారం మేర‌కు అనిల్ రావిపూడి ఈ సీక్వెల్‌కు స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌. ఇందులో మరికొంత మంది నటీ, నటుల విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.   ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఎఫ్ 3లో వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌తో పాటు మ‌రో హీరో ర‌వితేజ కూడా న‌టిస్తాడ‌ని టాక్‌. ఇప్పటికే అనీల్ రావిపూడి, రవితేజ కాంబినేషన్ లో ‘రాజా ది గ్రేట్’ మూవీతో భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఎఫ్ 2 మూవీ కామెడీ ట్రాక్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఓ భర్త, ప్రియుడు ప్రెస్టేషన్ తో వారికి దూరం కావడం.. తర్వాత దగ్గర కావడానికి ప్రయత్నించడం సినిమా మొదటి నుంచి ఎండ్ కార్డు పడే వరకు నవ్వులు పూయించాయి.

 

ఇక మాస్ మహరాజ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.  యాక్షన్ అయినా.. కామెడీ అయిన తన స్టైల్ వేరుగా ఉంటుంది. అందుకే ఆయన్ని అభిమానులు మాస్ మహరాజ అంటుంటారు.  మరి అనీల్ రావిపూడి తెరకెక్కించే ‘ఎఫ్ 3 ’ లో రవితేజ ఉంటే ఈ మూవీకి మరింత జోష్ ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నారు.  ఈ విషయం గురించి అలంటి అధికారిక ప్రకటన లేదు. చూడాలి మరి రవితేజ గురించి అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: