ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మీటూ ఉద్యమంలో భాగంగా గత ఏడాది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తమిళ సినిమాల్లో ప్రముఖ పాటల రచయితగా పేరు తెచ్చుకున్న వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా వైరముత్తు లొంగదీసుకోవాలని ప్రయత్నించాడని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. దీంతో తమిళ చిత్రసీమలో చిన్న అలజడే రేగింది. ఈ వ్యాఖ్యలను వైరముత్తు ఖండించడం కూడా జరిగింది.

 

 

అయితే రీసెంట్ గా చిన్మయి వైరముత్తుకు ఓ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇటివల.. వైరముత్తు మద్యపాన నిషేధంపై పలు వ్యాఖ్యలు చేశాడు. ‘తమిళనాడులో మద్యపాన నిషేధం విధించాలని కోరాడు. మద్యపాన నిషేధం విధిస్తే తమిళనాడులో జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టే అవకాశం ఉందని అన్నాడు. మద్యం మత్తులో జరిగే ఘోరాలను అరికట్టాలంటే మద్యపాన నిషేధం ఒక్కటే మార్గమని అన్నాడు’. వైరముత్తు వ్యాఖ్యలను ఓ వ్యక్తి చిన్మయికి ట్యాగ్ చేస్తూ ఆ వార్తను పోస్ట్ చేశాడు. దీంతో స్పందించిన చిన్మయి.. ‘మద్యపాన నిషేధం గురించి మాట్లాడే నువ్వే మొదట ఇది పాటించి ఉండాల్సింది. అదే జరిగుంటే 20ఏళ్ల క్రితం నీ లైంగిక దాడి నుంచి నేను తప్పించుకునేదానిని’ అని ట్వీట్ చేసింది.

 

 

వైరముత్తు మాట్లాడిన మాటలకు చిన్మయి రివర్స్ కౌంటర్ ఇచ్చినట్టైంది. ఈ ట్వీట్ తో మరోమారు వైరముత్తు తీరును చిన్మయి ఎండగట్టింది. వైరముత్తుపై చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ అంశంలో వైరముత్తును సపోర్ట్ చేసిన వారు కొందరైతే ఈ ఆరోపణలు నిజమేనన్నవారు కూడా కొందరున్నారు. అయితే మీటూ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో చిన్మయి ఈ వ్యాఖ్యలు చేయడంతో వైరముత్తు చర్యలు దాదాపు నిజమే అయి ఉంటాయని అప్పట్లో వాదనలు వచ్చాయి. Appo 20-30 varsham munnadi ozhichirundha naanga thappichuruppomla. https://t.co/juTVzAHfeJ

మరింత సమాచారం తెలుసుకోండి: