ఒకప్పుడు చేతినిండా సినిమాలతో ఆయన సినిమా వచ్చింది అంటే పక్కా హిట్ అనేలా ఉండే మాస్ మహరాజ్ రవితేజ ఈమధ్య కెరియర్ లో బాగా వెనుకపడ్డాడు. కొత్త వారసుల ఎంట్రీ ఇవ్వడం వారు కూడా సత్తా చాటుతుండగా ఈ హీరో సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. మధ్యలో రవితేజ రెండేళ్లు గ్యాప్ తీసుకోవడం వల్ల కూడా తన ఫ్యాన్స్ ను కొంతమంది మిస్ అయ్యాడు. అయితే రాజా ది గ్రేట్ తో హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలతో ఫ్లాప్ అందుకున్నాడు.

 

అందుకే ఈసారి ఆచితూచి అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం మాస్ రాజా చేసిన క్రేజీ మూవీ డిస్కో రాజా. రవితేజకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయిన టైటిల్ ఇది. వి.ఐ.ఆనంద్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు రవితేజ. నభా నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, తన్య హోప్ డిస్కో రాజాలో హీరోయిన్స్ గా నటించారు. ఈ సుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు రవితేజ ఫ్యాన్స్.

 

మాస్ మహరాజ్ రవితేజకు బంపర్ హిట్ వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. అయితే డిస్కో రాజా ఆ కల నెరవేరుస్తుందని అంటున్నారు. అంతేకాదు రవితేజ పని ఇక అయిపోయింది అనుకున్న వారికి ఈ సినిమా ఒక సమాధానం అయ్యేలా ఉండాలని రవితేజ గట్టిగ ఫిక్స్ అయ్యాడట. తన ప్లేస్ లో ఎవరు రాలేరు తన ప్లేస్ తనదే అనిపించుకునేందుకు రవితేజ మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. డిస్కో రాజా తర్వాత గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఆ సినిమా కూడా క్రేజీగా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు వరుసగా ఫ్లాపులు ఉన్నా డిస్కో రాజా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని తెలుస్తుంది. దాదాపుగా వరల్డ్ వైడ్ 22 కోట్ల దాక బిజినెస్ చేసింది డిస్కో రాజా. 

మరింత సమాచారం తెలుసుకోండి: