అనుకున్నట్టుగానే అల వైకుంఠపురములో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదే సన్ర్కాంతికు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాను మించి వసూళ్లు చేసిందా.. లేదా దానికి సమాధానంగా బాక్సాఫీస్ పై దూసుకెళ్లిందా అన్నది పక్కన పెడితే కరెక్ట్ గా చెప్పాలంటే సంక్రాంతికి వచ్చిన ఈ రెండు సినిమాలు మంచి హిట్ గా నిలిచాయి. సరిలేరు మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్ గా ఫ్యాన్స్ ఫీస్ట్ మూవీగా ఉండగా.. అల వైకుంఠపురములో కెంప్లీత్ గా త్రివిక్రం మార్క్ ఎంటర్టైనర్ మూవీతో పాటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటనా విశ్వరూపం చూపించేలా చేసింది.

 

అయితే ఈ రెండు సినిమాల్లో అల వైకుంఠపురములో సినిమా మ్యూజిక్ పరంగా ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. సామజవరగమన అంటూ ఒక చిన్న ట్యూన్ తో సినిమా మ్యూజిక్ గురించి ఎక్సైటింగ్ గా ఎదురుచూసేలా చేశాడు థమన్. అల వైకుంఠపురములో ఆల్బం లో ఒకదానికిమించి మరోపాట ఇచ్చాడు థమన్. మొన్నటివరకు కాపీ మ్యూజిక్ డైరక్టర్ అన్న పేరు పడ్డ థమన్ ఇక మీదట క్రేజీ మ్యూజిక్ డైరక్టర్ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనే విధంగా పలుకరించబడతాడు.

 

ముఖ్యంగా అల వైకుంఠపురములో సినిమా కోసం అతను ఎంత కష్టపడ్డది అన్నది త్రివిక్రం చెప్పిన విదానం అందరిని ఇంప్రెస్ చేసింది. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అనేలా థమన్ ఆలోచన ఉంటుందని ఆయన అన్నారు. అయితే అల వైకుంఠపురములో సినిమాతో థమన్ చాలా ఎత్తుకి ఎదిగాడు. ఇక మీదట రాబోయే సినిమాలు కూడా అదే రేంజ్ మ్యూజిక్ ఇస్తేనే ఈ పేరుకి న్యాయం చేసినట్టు అవుతుంది. అలా కాకుండా మళ్లీ తన పాత కాపీ క్యాట్ ప్రోసెస్ మొదలు పెడితే మాత్రం మళ్లీ దెబ్బ పడే అవకాశం ఉంది. అందుకే అల వైకుంఠపురములో తర్వాత కూడా థమన్ తన బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: