ఈ మద్య కోలీవుడ్ నటులు తెలుగు లో కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. తమిళంలో మంచి హిట్ అయిన మూవీతో తెలుగులో డబ్ చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు.  తాజాగా జూనియర్ ఆర్టిస్టుగా తన కెరీర్ మొదలుపెట్టి  జాతీయ పురస్కారం అందుకునే స్థాయికి ఎదిగారు బాబీ సింహా. ‘జిగర్తాండ’ సినిమాతో తమిళనాట తెగ హల్ చల్ చేశాడు.  ఈ మూవీ తెలుగు లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దల కొండ గణేష్’ గా రిమేక్ చేసి ఇక్కడ కూడా మంచి విజయం అందుకున్నారు. అయితే తమిళంలో ‘జిగర్తాండ’లో నటనకు గాను బాబీ సింహాకు నేషనల్ అవార్డ్ దక్కింది.  ‘పేట’ సినిమాలో రజినీకాంత్‌తో కలిసి నటించిన బాబీ సింహా.. ప్రస్తుతం కమల్ హాసన్ ‘భారతీయుడు 2’లోనూ చేస్తున్నారు. అంతే కాదు వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సైన్స్‌ఫిక్షన్ మూవీ ‘డిస్కోరాజా’ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు.

 

రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా బాబీ సింహా మాట్లాడుతూ.. పలు ఆసక్తి కరమైన విశేషాలు చెప్పారు. మా తల్లిదండ్రులది విజయవాడ దగ్గర బందర్‌. నేను హైదరాబాద్‌లో పుట్టాను. నాలుగో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. పదో తరగతి వరకు అవనిగడ్డలో చదువుకున్నాను.1995లో తమిళనాడులోని కొడైకెనాల్‌కు వెళ్లాం.. అక్కడ నుంచి నేను బాలనటుడిగా కెరీర్ ప్రారంభించాను. అయితే నేను జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేశాను. రోజుకి రూ.250 ఇచ్చేవారు.. అప్పట్లో నాకు చాలా ఇబ్బందులు.. కష్టాలు ఉండేవి. అయితే నేను సంపాదించిన దానిలో రూ.50 మాత్రం ఫ్రెండ్స్ కి పార్టీకోసం ఖర్చు చేసేవాడిని.  ఇప్పుడు డబ్బులు ఉన్నా.. నాకు టైమ్ దొరకడం లేదని అన్నారు.  

 

తెరపై ఒక్కసారైనా కనిపించాలని ఎంతో మంది అనుకుంటారు.  దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. అవకాశం కోసం ఎదురుచూడండి. వచ్చినప్పుడు మాత్రం శక్తి వంచన లేకుండా పని చేసి మనల్ని మనం నిరూపించుకోవాలి.. అదే మనకు మంచి మార్గాన్ని నిర్ధేషిస్తుందని అన్నారు. నాతో పాటు కెరీర్ స్టార్ట్‌ అయిన విజయ్‌ సేతుపతి ముందుకు పరిగెడుతున్నారు అంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రవితేజగారు సెట్‌లో ఫుల్‌ ఎనర్జీతో ఉంటారు. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్, టైమింగ్‌ చాలా బాగుంటాయి. ఇప్పటి నేను దాదాపు 45 సినిమాలు చేశాను. ఎలా పాత్రలే చేయడానికైనా నేను రెడీ.. నటుడిగా నిరూపించుకోవడం ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: