ర‌వితేజ మాస్ మ‌హారాజాగా తెలుగు ఇండ‌స్ట్రీలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజాది గ్రేట్ త‌ప్పించి ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన చిత్రాలేమీ పెద్ద‌గా హిట్ కాలేదు. ప్ర‌స్తుతం రాబోయే డిస్కోరాజా ర‌వితేజ కెరియ‌ర్‌లోనే అత్యంత ముఖ్య‌మైన సినిమా అని చెప్ప‌వ‌చ్చు.  ‘నేల టికెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలు మాస్ రాజా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి.  ఈ చిత్రాన్ని వి.ఐ. ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రామ్ తాళ్ళూరి నిర్మించారు. ఈ మ‌ధ్య‌కాలంలో ర‌వితేజ నుంచి ప‌ర్వాలేద‌నిపించుకునే చిత్రం ఒక్క‌టి కూడా రాలేదు. 

 

స్టార్ హీరోలంతా కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తూ ఇండ‌స్ట్రీలో ముందుకు వెళుతుంటే... ర‌వితేజ మాత్రం అదే మూస ప‌ద్ధ‌తిలో వెళ్ళ‌డం వ‌ల్ల వెన‌క‌బడిపోయాడు. ప్ర‌స్తుతం వ‌స్తున్న డిస్కోరాజా వీఐ ఆనంద్ లాంటి డిఫరెంట్ డైరెక్టర్‌తో అతను చేసిన సినిమా ‘డిస్కో రాజా’. ప్రోమోలు చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా ఉండేలా కనిపిస్తోంది.

 

‘డిస్కో రాజా’ తన కెరీర్లో అత్యంత ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా అని రవితేజ చెపుతున్నారు. దీని రెండు టీజర్లలోనూ మాస్ రాజా ఎనర్జీ చూసి అభిమానులే ఆశ్చర్యపోయారు. ఈ సినిమా ఔట్ పుట్, వీఐ ఆనంద్ పని తీరు విషయంలో ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు రవితేజ.. ఈ చిత్రం మంచి హిట్ అయితే గ‌నుక సీక్వెల్, ప్రీక్వెలో కూడా ఉంటుంది అని అన్నారు.

 

‘నేల టిక్కెట్టు’ చిత్రం  తీసిన రామ్ తాళ్లూరితోనే ఈ చిత్రం చేసి.. ఆ ఫ్లాప్ ఖాతాను భ‌ర్తీ చేస్తున్నాడు.  తన గత సినిమాల ఫలితాల గురించి పట్టించుకోకుండా బాగా ఖర్చు పెట్టి రిచ్‌గా ఈ సినిమాను నిర్మించిన రామ్‌తోనే ‘డిస్కో రాజా’కు కొనసాగింపుగా సినిమా చేయాలనుకుంటున్నాడు మాస్ రాజా. ఈ 24న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎంత మేర‌కు ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: