భారతీయ చలన చిత్ర రంగంలో విశ్వనటుడుగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్.  సినీ రంగంలో ఆయన చేయని ప్రయోగాలు లేవు.  కుర్రవాడిగా.. ముదుసలి వ్యక్తిగా.. పొట్టివాడిగా ఏ పాత్రలో అయిన జీవించే గొప్ప నటులు కమల్ హాసన్.  అయితే ఆయన కూతురు శృతిహాసన్  సైతం పలు రంగాల్లో మంచి ప్రావిణ్యం సంపాదించింది. సంగీతంతో పాటు మంచి గాయని గా కూడా పేరు తెచ్చుకుంది.  ఇక బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.  కొంత కాలంగా ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. ప్రేమ వ్య‌వ‌హ‌రంతో  సినిమాల‌కు  దూరంగా  ఉన్న నటి   శృతిహాస‌న్  బ్రేక‌ప్  త‌ర్వాత  మళ్లీ   సినిమాల్లో న‌టిస్తోంది. మ‌రో ప‌క్క మ్యూజిక్  ఆల్బ‌మ్స్ చేస్తూ  బిజీగా ఉంది. 

 

ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయాల్లోకొనసాగుతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ మూవీలో నటిస్తుంది.  ఇప్పటికే ఓ పార్టీ స్థాపించిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తూ వస్తున్నారు.  ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 మూవీలో నటిస్తున్నారు.  తాజాగా ఆయన కూతురు శృతి హాసన్ మాట్లాడుతూ.. తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టిస్తున్న  శృతిహాస‌న్  వెబ్ సిరీస్‌ల్లోనూ  నటిస్తున్నాను.   

 

రాజ‌కీయాల్లో  తండ్రికి  త‌న మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుందని, రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం త‌న‌కు ఆస‌క్తి లేద‌ని, రాజకీయాల్లోకి వ‌స్తానా.. రానా.. అని ఇప్పుడే చెప్ప‌లేనని తెలిపింది.  గతంలో కమల్ హాసన్ సైతం తాను సినిమాల్లోనే నటిస్తానని అన్నారు.. కానీ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన కూతురు శృతిహాసన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కొంపదీసి ఈ అమ్మడు భవిష్యత్ లో తండ్రి స్థాపించిన పార్టీ తరుపున పోటీ చేస్తుందా.. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. కాగా, సినిమాల్లో నటించిన వారు మంచి స్థాయి వచ్చాక రాజకీయాల్లోకి రావడం చూస్తూనే ఉన్నాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: