టాలీవుడ్ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా చిన్న వయసులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన నీడ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు అడుగుపెటన కృష్ణ చిన్న తనయుడు మహేష్ బాబు, ఆ తరువాత బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి అప్పటి ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించడం జరిగింది. అయితే చివరిగా బాలచంద్రుడు అనే సినిమాలో బాలనటుడిగా నటించిన మహేష్, ఆపై కొంత విరామం తీసుకుని యాక్టింగ్, ఫైట్స్, డాన్స్, వంటి పలు కళల్లో శిక్షణ తీసుకుని 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదటి సినిమాతోనే తండ్రి కృష్ణకు తగ్గ తనయుడిని మంచి పేరు సంపాదించిన మహేష్

 

ఆ తరువాత నుండి తన టాలెంట్ తో మెల్లగా సినిమా అవకాశాలతో దూసుకుపోయారు. అయితే కెరీర్ పరంగా ఇప్పటివరకు 26 సినిమాల్లో నటించిన మహేష్ బాబు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటు కొన్ని ఫ్లాప్స్ కూడా అందుకున్నారు. ఇక ఇటీవల ఆయన హీరోగా నటించిన 26వ సినిమా అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా, సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి సక్సెస్ ని అందుకుంది. మహేష్ సరసన రష్మిక మందున్న హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఇక ఇటీవల ఈ సినిమా సక్సెస్ఫుల్ గా ముందుకు సాగడంతో సరిలేరు యూనిట్, తమ సినిమాను మరింతగా ప్రమోట్ చేసింది. అటువంటి సక్సె మీట్స్ లో భాగంగా నాలుగు రోజుల క్రితం కొందరు ఆర్మీ జవాన్ లతో కలిసి 'జైహింద్' ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హీరో మహేష్, దర్శకుడు అనిల్, నటి విజయశాంతి తదితరులు పాల్గొని వారితో తమ అనుభవాలు పంచుకున్నారు. 

 

ఎన్టీవీ వారు రూపొందిందించిన ఈ కార్యక్రమం రిపబ్లిక్ డే నాడు ప్రసారం కానుండగా, దాని తాలూకు వీడియో ప్రోమోని కాసేపటి క్రితం సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియోలో మహేష్ మాట్లాడుతూ, తనకు టాలీవుడ్ దాటి వేరే ఇండస్ట్రీలైన బాలీవుడ్, హాలీవుడ్ వంటి వాటికి వెళ్లడం ఇష్టం లేదని, వందేళ్లు వచ్చినా తాను మాత్రం తెలుగులోనే నటిస్తానని చెప్పడంతో అందరూ ఒక్కసరిగా చప్పట్లతో హోరెత్తించారు. వాస్తవానికి గతంలో కూడా ఈ విషయమై పలు ఇంటర్వ్యూ ల్లో మాట్లాడిన మహేష్, తనకు బాలీవుడ్ సహా పలు ఇతర భాషల్లో కూడా అవకాశాలు వచ్చినప్పటికీ తాను మాత్రం చేయలేనని వారికి తేల్చి చెప్పానని, తనకు టాలీవుడ్ అన్నా, ఇక్కడి ప్ర్రేక్షకులు అన్నా ఎంతో అభిమానమని చెప్పిన మహేష్, వీలైతే తన సినిమాలు ఇతర భాషల్లో డబ్ కాబడి రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: