‘డియర్ కామ్రేడ్’ పరాజయం చెందినా యూత్ లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఎవరైనా అంగీకరించవలసిన వాస్తవం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలోని అమ్మాయిలలో కూడ ఇతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 

ఇలాంటి పరిస్థితులలో వచ్చేనెల విడుదల కాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీకి భారీ క్రేజ్ తీసుకు రావడానికి ప్రస్తుతం విజయ్ అనుసరిస్తున్న సెమీ న్యూడ్ కల్చర్ పై విజయ్ అభిమానులలో కూడ కొన్ని  సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఈమధ్య వరసపెట్టి విడుదల చేస్తున్న ఫోటోలలో విజయ్ షర్ట్ లేకుండా సెమీ న్యూడ్ గా కనిపిస్తూ యూత్ లో ముఖ్యంగా అమ్మాయిలలో తన క్రేజ్ ను పెంచుకోవడానికి మరింత ప్రయత్నాలు చేస్తున్నాడు. 

సాధారణంగా ఇలాంటి ఎక్స్ పోజింగ్ లేదంటే సెమీ న్యూడ్ ఫోటోలను హీరోయిన్స్ కు సంబంధించి విడుదల చేస్తారు కాని ఒక హీరోకి సంబంధించి ఇలా ఎక్కువగా సెమీ న్యూడ్ ఫోటోలను వరసపెట్టి విడుదల చేయరు. విలక్షణ దర్శకుడుగా పేరు గాంచిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ‘అర్జున్ రెడ్డి’ ఛాయలతో ఉన్న ఈ సెమీ న్యూడ్ ఫోటోలు ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు.

వాస్తవానికి ‘డియర్ కామ్రేడ్’ పరాజయం తరువాత విజయ్ కల్పించుకుని ఈ సినిమా కథలో చాల చాలా మార్పులు చేయడమే కాకుండా తనకు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు సందీప్ వంగా సలహాలను కూడ ఈ సినిమా విషయంలో ఇప్పటికే తీసుకున్నాడు అన్న వార్తలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి  సంబంధించిన వరస పెట్టి వదులుతున్న ఈ సెమి న్యూడ్ ఫోటోలు వల్ల ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందా అన్న సందేహాలు ఏర్పడితే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు దూరం అయ్యే ప్రమాదం ఉంది అన్నభయాలు విజయ్ అభిమానులను వెంటాడుతున్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: