వెంకీ మామా సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న వెంకటేష్ తన తర్వాతి సినిమగా తమిళంలో ఘన విజయం సాధించిన అసురన్ సినిమాని రీమేక్ చేసే పనిలో పడ్డాడు. తమిళంలో ఈ సినిమాని వెట్రిమారన్ దర్శకత్వం వహించగా ధనుష్ ప్రధాన పాత్రలో నటించాడు, ఈ సినిమాలో ధనుష్ నటన చాలా బాగుందంటూ ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాడని తెలియగానే అందరిలోకి ఒకే సందేహం మొదలైంది.

 

సినిమా వెంకటేష్ కి వర్కౌట్ అవుతుందాఅ అని.. ధనుష్ నటనలో విశ్వరూపం చూపించిన ఈ సినిమా వెంకీకి సెట్ కాదనే వార్తలు వచ్చాయి. సినిమా రీమేక్ అని తెలియగానే ఆ సినిమాలో ఏముందో చూసేసి అది వెంకటేష్ కి వర్కౌట్ కాదని తేల్చి చెప్పేశారు. మళ్ళీ అదీ గాక శ్రీకాంత్ అడ్డాల లాంటి ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ఇలాంటి సినిమాని తెరకెక్కిస్తున్నాడని తెలియగానే ఈ నెగెటివిటీ మరింత పెరిగింది.

 

అయితే మొన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ధనుష్‌‌ను అద్భుతంగా అభినయించిన పాత్రలో వెంకీ ఏమాత్రం ఫిట్ అవుతాడో అనుకుంటే.. ఆయన లుక్ చూశాక ధనుష్‌ను మించిపోయాడని అనిపిస్తోంది జనాలకు. గెటప్ భలేగా కుదిరి.. ధనుష్ కన్నా వెంకీ ఈ పాత్రలో బాగుంటాడనే భావన కలిగింది. లుక్ పర్ఫెక్ట్‌గా ఉండటం, సినిమాలోని ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గని రీతిలో ఫొటో షూట్ చేయడంతో ‘నారప్ప’ ఫస్ట్ లుక్స్‌ ఇన్‌స్టంట్‌గా హిట్టయిపోయాయి. 

 

ఇప్పటిదాకా ఉన్న నెగెటివిటీ అయితే పక్కకు పోయినట్లే. సినిమా కూడా బాగా తీస్తే తెలుగులోనూ మంచి విజయం సాధించే అవకాశముంది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా వెంకీ సరసన హీరోయిన్ గా ప్రియమణి కనిపించనుంది. ఇంకా ఈ సినిమాలో ఎక్కువ మంది కొత్తవారే కనిపించనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: