నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో జొరు మీదున్నాడు. గ్యాంగ్ లీడర్ అంత పెద్ద విజయం సాధించకపోయినా ఫర్వాలేదులే అనిపించింది. అయితే ప్రస్తుతం వి సినిమా బిజీలో ఉన్న నాని ఆ తర్వాత వరుస సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. సాధారణంగా కొత్త దర్సకులకి ఛాన్స్ ఇవ్వడం నానికి అలవాటు. మళ్ళీ రావా సినిమా ద్వారా విమర్శకుల మెప్పు పొందిన గౌతమ్ తిన్ననూరిని నమ్మి జెర్సీ సినిమా చేశాడు.

 

 

సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ఆ సినిమా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతుంది. అదలా ఉంచితే కొత్త దర్శకుల కథలు వినడానికి సిద్ధంగా ఉండే నాని దగ్గరికి దర్శకులు క్యూ కడుతున్నారట. కానీ ప్రస్తుతానికి నాని రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వి సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్నాడు.

 


ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఎమోషనల్ లవ్ స్టోరీ గా రూపొందనున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. అయితే ఈ గ్యాప్ లో నాని మరో దర్శకుడితో చర్చలు జరిపి మరో రెండు చిత్రాలని కన్ఫర్మ్ చేసేశాడు. టాక్సీ వాలా సినిమా ద్వారా అంతో ఇంతో పేరు సంపాదించిన రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్నాడట.

 

అయితే రాహుల్ సాంకృత్యాయన్ చేసిన రెండు సినిమాలు హార్రర్ జోనర్ కావడంతో ఈ సినిమాని ప్రేమ కథాచిత్రంగా మలచనున్నారట... మరి కొత్త దర్శకుడితో నాని చేస్తున్న ఈ సాహసం వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. ప్రస్తుతానికి నాని నటించిన "వి" సినిమా ఉగాది కానుకగా విడుదల అవుతోంది. ఈ సినిమాకి ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: