టాలీవుడ్ లో వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాసు’ మూవీతో తొలిపరిచయం అయ్యారు హీరో రామ్ పోతినేని, ఇలియానా.  ఈ మూవీలో ఇలియానా నడుం వంపులకు కుర్రాళ్ల మతులు పోగొట్టుకున్నారు.  ఇక టాలీవుడ్ హీరోలు అయితే తమ పక్కన ఇల్లీ బేబీ అయితే బాగుటుందని దర్శక, నిర్మాతలకు సలహాలు కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.  ఆ రేంజ్ లో తన అందచందాలతో మంత్ర ముగ్దులను చేసిన ఇలియానా టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది.  ఇదే సమయంలో బాలీవుడ్ ని ఏలేద్దామని అక్కడికి పయణం అయ్యింది.  కానీ ఈ అమ్మడు ఆశలు నిరాశలు అయ్యాయి.. ఒక్క మూవీ కూడా సక్సెస్ కాకపోవడంతో కెరీర్ కష్టాల్లో పడింది.

 

దక్షిణాదిన అప్పటికే కొత్త హీరోయిన్లు తమ జోరు కొనసాగించడం మొదలు పెట్టడంతో.. ఇక్కడ ఒక్క ఛాన్సు కూడా రాలేదు.  అంతలోనే ప్రేమ వ్యవహారం.. తర్వాత బ్రేకప్ కూడా అయ్యాయి. ఈ సమయంలో ఇలియానా తన పర్సనాలిటీ బాగా పెంచేసుకోవడంతో సినిమా ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి.  ఆ మద్య శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంథోని’ మూవీలో ఇల్లీ బేబీకి ఛాన్స్ వచ్చింది..అదే సమయంలో ఆమె పర్సనాలిటీపై కామెంట్స్ బాగా వచ్చాయి.  దాంతో ఇక పూర్తిగా తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టినట్టు వార్తలు వచ్చాయి.

 

అయితే తన పర్సనాలిటీని కవరింగ్ చేసుకోవడానికి కాస్త టైట్ దుస్తులు వేస్తూ.. స్లిమ్ గా కనిపించడానికి తెగ కష్టపడిపోతుంది. బ్లాక్ చిరుత చర్మం ఫార్మల్ డ్రెస్ లో అలా ఆరుబయట నడిచి వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. ఇలా ఎంతో క్యాజువల్ గా కనిపిస్తున్నా.. ఇల్లీ బేబీ బొద్దందం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.  అయితే తాను మాత్రం సన్నబడటానికి డైటింగ్ చేస్తున్నానని... త్వరలో పాత రూపానికి వచ్చేస్తానని తన సన్నిహితులతో చెబుతున్నట్లు బాలీవుడ్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: