బండ్ల గణేష్ ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఇతను బ్లేడ్ గణేష్‌గా కూడా పాపులారిటీ సంపాదించుకున్నాడు. రాజకీయాల్లో కూడా వేలుపెట్టి తన తలను బొప్పికట్టించుకుని, ఆనక కిమ్మనకుండా వ్యాపారాలను చూసుకుంటున్న బండ్ల ఇమేజ్‌ను బండకేసి బాదాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఏదో తన మానాన తాను పోయిన పరువును నిలబెట్టుకొవడానికి తెరపైన కనిపించకుండా ఆ ప్రయత్నాలు చేసుకుంటుండగా తనకు తగ్గిన దురదను అంటించాడట ఈ దర్శకుడు.

 

 

అదెలా అంటే ముఖానికి రంగుపడక, చాలా సంవత్సరాలు అయిందట. కానీ, బాషా సినిమాలోలా మరచిన గతాన్ని గుర్తు చేస్తూ మళ్లీ మొహానికి మేకప్ వేసి, కెమేరా ముందు నిల్చోపెట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఒక రేంజ్లో బండ్ల గణేష్ కూడా తెగ ఉత్సాహ పడ్డాడట.. ఇప్పటికే యూ ట్యూబ్ లో ఫుల్ ఫాలోయింగ్ వున్న తనకు ఈ సినిమా టర్నింగ్ అవుతుందని, మనసులో తనకు అంతగా ఇష్టం లేకపోయినా, మళ్లీ నటుడిగా సినిమారంగంలో వుండాలన్న తన కోరిక తీర్చుకుందామని అనుకున్న బండ్ల ఆశలు అన్నీ అడియాసలు చేసాడట అనిల్..

 

 

సరిలేరు నీకెవ్వరులో తన క్యారెక్టర్ తనకు బాధనే మిగిల్చిందని, అంతే కాకుండా తన పరువు కూడా తీసిందని వాపోతున్నాడట. అంతే కాకుండా ఈ చిత్రంలో బండ్ల పాత్ర చాలా దారుణంగా వుందన్న కామెంట్లు వినిపిస్తుండటమే కాకుండా, ముఖ్యంగా చుట్టాలు, స్నేహితులు, అతగాడి పిల్లల ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఆ క్యారెక్టర్ చూసి కామెంట్లు విసురుతున్నారట. బండ్ల పిల్లలు కూడా 'నాన్నా నీకు ఈ వేషం అవసరమా' అని అడిగారట. దీంతో ఫ్రస్టేట్ అయిన బండ్ల ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి మీద కారాలు మిరియాలు నూరుతున్నాడట. అంతే కాదు అనిల్ రావిపూడి మీద నానా శాపనార్థాలు పెడుతున్నాడట.

 

 

ఇక తన క్యారెక్టర్ ను మొత్తం తీసేసినా తాను బాధపడేవాడిని కాదని, కాని తలా తోకా లేకుండా తన క్యారెక్టర్‌ను ప్రజంటేషన్ చేసి తన పరువును మూసినది పాలు చేసి ఇలా అవమానించడం సరికాదని వాపోతున్నాడట.. ఇలా కేవలం బాధపడడం కాదు, బండ్లను పలకరించిన ప్రతి ఒక్కరి దగ్గర అనిల్ రావిపూడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడట.... ఈ విషయం తెలిసిన వారు అనిలా పిలిచి పరువు తీసుకోవడమంటే ఇదే అని తెలుసుకో అంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: