మాస్ మహారాజా రవితేజ కి రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ ఒక్క హిట్ కూడా పడలేదు. మధ్యలో వచ్చిన సినిమాలన్ని ఫ్లాపయ్యాయి. అయినా మాస్ రాజా క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదని డిస్కో రాజా తో అర్థమవుతోంది. ఆయన హీరోగా తెరకెక్కిన 'డిస్కోరాజా' 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన ఆసక్తికరమైన టీజర్స్.. లిరికల్ సాంగ్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వాస్తవంగా రవితేజ ఈమధ్య నటించిన సినిమాలు సరిగా మెప్పించలేకపోయినప్పటికి ఆ ప్రభావం 'డిస్కోరాజా' సినిమాపై ఏమాత్రం కనిపించడం లేదు. ఆ విషయం ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే అర్థమవుతోంది.

 

సైఫై యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇక 'డిస్కోరాజా' ప్రమోషన్లలో భాగంగా వీఐ ఆనంద్ ..ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకాన్ని ధిమ్మాగా తెలిపాడు. ఏ సినిమాకైనా కథే ముఖ్యం. అందుకే కథను బట్టే హీరోను ఎంచుకుంటానని ఆనంద్ తెలిపారు. ఈ సినిమాకు రవితేజ కరెక్ట్ గా సరిపోతారనే ఆయనతో తీసానని అన్నారు. మంచి కాన్సెప్ట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా ఈ సినిమాను రూపొందించామని తెలిపారు.

 

సైఫై జోనర్ అనగానే ఇదేదో హాలీవుడ్ సినిమాకు కాపీ అని చాలామంది అంటున్నారు. అయితే ఆ విషయంలో క్లారిటి ఇచ్చాడు దర్శకుడు. 'డిస్కోరాజా' ఏ హాలీవుడ్ సినిమాకు కాపీ కాని.. ప్రేరణ కానీ కాదని క్లియర్ గా చెప్పాడు. న్యూస్ పేపర్ లో బయో కెమికల్ లాబ్ కు సంబంధించిన ఒక వార్తను చదివిన తర్వాత ఈ సినిమా కథకు ఐడియా వచ్చిందని వెల్లడించాడు ఆనంద్. ఒక పరిశోధనశాలలో జరిగే రీసెర్చ్ విజయవంతమైతే ఎమౌతుంది అనే ఆలోచన ఈ సినిమా కథగా మలుచుకున్నానని అన్నాడు. మరి ఇంత కొత్తగా రూపొందించిన డిస్కోరాజా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అన్నది ఇంకొన్ని గంట్టల్లో తేలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: