మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ డైరక్షన్ లో వచ్చిన సినిమా డిస్కో రాజా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ షో టాక్ చూస్తే రవితేజ చివరి మూడు సినిమాల కన్నా పర్వాలేదు అనిపించినా సూపర్ హిట్ స్టఫ్ అయితే కాదన్న టాక్ వినిపిస్తుంది. సైఫై కాన్సెప్ట్ తో ఫస్ట్ హాఫ్ డైరక్టర్ అదరగొట్టాడని తెలుస్తుంది. డిస్కో రాజాగా రవితేజ అదరగొట్టగా మిగతా పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది. అందుకే సినిమాకు యావరేజ్ టాక్ వస్తుంది.

 

సంక్రాంతి సినిమాల తర్వాత సినిమాలేవి లేకపోవడంతో రవితేజ డిస్కో రాజా సోలోగా వచ్చాడు. అయితే ఈసారి ఎలాగైనా మాస్ రాజా హిట్ కొడతాడనే నమ్మకంతో ఆన్ లైన్ బుకింగ్స్ కూడా బాగా అయ్యాయి. వీకెండ్ వరకు రవితేజ మంచి వసూళ్లు తెచ్చుకోవచ్చనే అంటున్నారు. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకే అని చెప్పొచ్చు.

 

వి.ఐ.ఆనంద్ కథ కథనాలు సినిమాకు ప్లస్ అయినా కొన్ని చోట్ల అతని అనుభవం సినిమాను ప్రేక్షకులకు చేరువేయడంలో విఫలమైందని తెలుస్తుంది. సినిమాలో రవితేజతో పాటుగా విలన్ గా నటించిన బాబీ సిం హా కూడా బాగా చేసినట్టు తెలుస్తుంది. ముగ్గురు అందాల భామలు కూడా వారి అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. థమన్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించింది. అయితే ప్రీమియర్స్ నుండి యావరేజ్ టాక్ రాగా ఫస్ట్ హాఫ్ అదరగొట్టిన డైరక్టర్ సెకండ్ హాఫ్ చెడగొట్టాడని అంటున్నారు. మరి అసలు టాక్ ఏంటన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. డైరక్టర్ ఆనంద్ సినిమాను బాగానే నడిపించినా సినిమా ఎక్కడో లాజిక్ మిస్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు. రవితేజ ఫుల్ ఎనర్జీ సినిమాకు ప్లస్ అయిందని తెలుస్తుంది. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్,  నభా నటేష్తాన్యా హోప్ తమ అందాలతో ఆకట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: