వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మహారాజా ర‌వితేజ‌ హీరోగా రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న చిత్రం డిస్కోరాజా. సాధార‌ణంగా వి.ఐ. ఆనంద్ మూవీస్ అంటేనే ఖ‌చ్చితంగా ఇద్ద‌రు లేదా ముగ్గురు హీరోయిన్స్ ఉండ‌డం స‌ర్వ‌సాధార‌ణం అయిపోయాయి. ఆయ‌న గ‌త చిత్రాలు ఒక్క‌క్ష‌ణం,టైగ‌ర్‌, ఎక్క‌డికిపోతావే చిన్న‌వాడ ఈ చిత్రాల్లో కూడా ఇద్ద‌రు హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు తాజాగా తెర‌కెక్కిన డిస్కోరాజాలో కూడా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు.  

 

పేరుకి ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నప్పటికీ కథకి అవసరమున్న పాత్రలో కనిపించింది మాత్రం పాయల్ రాజ్ పుత్. తను వింటేజ్ స్టైల్లో చాలా బాగుంది, అలాగే తన పాత్రలో చాలా బాగా చేసింది. నభ నటేష్ కి పెద్ద పాత్ర లేదు, ఉన్నంతలో ఓకే. ఇక సైంటిస్ట్ గా తన్య హోప్ ఉన్నంతలో బాగా చేసింది. తన్య హోప్ – వెన్నెల కిషోర్ మధ్య సీన్స్ కొన్ని నవ్వులు పూయిస్తాయి. ఇందులో త‌న్య ల్యాబ్‌లో రీసెర్చ్ సైటింస్ట్ లాగా క‌నిపిస్తుంది. ఇక పాయ‌ల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అందాల ఆర‌బోత‌లో ఉందుంటుంద‌న్న విష‌యం తెలిసిందే. అలాగే బోల్డ్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డంలో కూడా ఎటువంటి సంకోచం లేకుండా అద‌ర‌గొట్టేస్తుంది. మ‌రి ఇందులో వి.ఐ. ఆనంద్ ఏ మేర‌కు పాయ‌ల్‌ని చూపించారో చూడాలి. అలాగే ఎలాంటి పాత్ర‌నైనా స‌రే అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌దు పాయ‌ల్. సాధార‌ణంగా హీరోయిన్లు కొన్ని బోల్డ్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డానికి అలాగే విల‌నిజ‌మ్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌డానికి పెద్ద‌గా ఒప్పుకోరు కాని పాయ‌ల్ అందుకు విరుద్ధంగా ఉంటుంది. 

 

ఇక న‌భాన‌టేష్ ఈమె కూడా దాదాపుగా అందాలు ఆర‌బోసే విష‌యంలో ఎక్క‌డా వెన‌కాడ‌ద‌నే చెప్పాలి. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో ఈమె న‌ట‌న అద్భుతం ఒక రౌడిలాంటి క్యారెక్ట‌ర్‌లో అద‌ర‌గొట్టింది. ఈ చిత్రంలో త‌న పాత్ర‌కు త‌గిన‌ట్టు అద్భుత‌మైన న‌ట‌న‌నే క‌న‌బ‌రిచింది. ఇక ర‌వితేజ‌కి ముగ్గురు హీరోయిన్స్ అంటే ఒక‌ర‌కంగా కాస్త ఎక్కువ‌నే చెప్పాలి. కాక‌పోతే రెట్రో స్టైల్లో, కాస్త డిస్కోమోడ‌ల్ కావ‌డంతో ముగ్గురికి దాదాపుగా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే రాశాడు ఆనంద్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: