అనిల్ రావిపుడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం విపరీతమైన వసూళ్ళతో దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి ఎబోవ్ యావరేజి టాక్ వచ్చినా కూడా పండగ సీజన్ అడ్వాంటేజిగా మారడంతో కలెక్షన్లు కొల్లగొడుతోంది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ అభిమానులకి కనువిందుగా నిలిచింది. అందుకే మహేష్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

 

ఇప్పటి వరకు మహర్షి సినిమా మహేష్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కానీ సరిలేరు నీకెవ్వరు చిత్రం మహర్షి దాటి ముందుకు వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి చర్చించుకోవాలి. సూపర్ స్టార్ మహేష్ బాబుకి కెరీర్ బెస్ట్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది. మొదటి సినిమా పటాస్ దగ్గరి నుండి ఇప్పటి వరకు తిసిన అన్ని సినిమాలు హిట్ అవడం నిజంగా అద్భుతం..

 

కేవలం హిట్ అవడమే కాదు తాను పనిచేసిన హీరోలందరికీ కెరీర్ బెస్ట్ ఇవ్వడమే అనిల్ కే సాధ్యమైంది. ఇప్పటి వరకు ఐదుగురు హీరోలతో పనిచేసిన అనిల్ ఆ ఐదుగురికి తమ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాతో పాటు వసూళ్ళ పరంగా బెస్ట్ సినిమాని ఇచ్చాడు.  నందమూరి కళ్యాణ్ రామ్‌తో తొలిసారి జోడీ కట్టిన అనిల్.. 'పటాస్' రూపంలో అతడికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. అప్పట్లోనే అది రూ.25 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. 

 

ఆ తర్వాత అతను మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్‌‌తో 'సుప్రీమ్' తీశాడు. అది కూడా రూ.25 కోట్ల షేర్ మార్కును దాటి తేజుకు కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. దీని తర్వాత అనిల్ తీసిన 'రాజా ది గ్రేట్' రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం రూ.30 కోట్లకు పైగానే షేర్ కలెక్ట్ చేసింది. ఇక ఎఫ్ ౨ గురించి అందరికీ తెలిసిందే... ఇక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు తో మహేష్ కెరీర్లోనూ బెస్ట్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: