గత కొంత కాలంగా టాలీవుడ్ లో కొత్త కొత్త కంటెంట్స్ తో ప్రయోగాత్మక సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు ఈ తరహా సినిమాలు బాలీవుడ్, కోలీవుడ్ లో వచ్చేవని టాక్.  అయితే ఈగ, బాహుబలి డిఫరెంట్ ప్రేమ కథగా అర్జున్ రెడ్డి ఇలా వస్తున్న సినిమాలకు ప్రేక్షకాదరణ బాగా లభిస్తుంది. అయితే కొన్ని సినిమాలు పెద్దగా రాణించకున్నా కంటెంట్ వర్క్ ఔట్ అయిన సినిమాలు మాత్రం సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి.  ఈ తరహా విభిన్నమైన కథతో వచ్చిందే రవితేజ నటించిన ‘డిస్కోరాజా’.  ఒక స్నో మౌంటైన్ లో పడి బ్రెయిన్ డెడ్ అయిన వాసు(రవితేజ)ని అక్కడ ఉన్న బయో కెమికల్ ల్యాబ్ వారు తీసుకొచ్చి తనపై ప్రయోగం చేస్తారు. దాంతో వాసు బతుకుతాడు.

 

అక్కడి నుంచి తప్పించుకొని తన గతం, తన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు.. ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న కష్టాలు.. ట్విస్ట్ లు తెరపై దర్శకుడు బాగానే చూపించాడు. అయితే ఈ తరహా సినిమా రవితేజకు కూడా కొత్త కావడంతో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి రాజాది గ్రేట్ లాంటి సినిమాలో పూర్తిగా అంధుడిగా నటించిన రవితేజ మంచి హిట్ అందుకున్నాడు.   సైన్స్‌తో ఏదైనా సాధ్యమే.. మంచి,చెడు  క్రేజీ అంటూ వచ్చిన మోషన్ పోస్టర్ ఇప్పటికే అదిరిపోయింది. అదే సినిమాలో కూడా చూపించాడు దర్శకుడు.

 

సైన్స్ ఫిక్షన్ డ్రామాను రవితేజ ఇమేజ్‌కు తగ్గట్లు రాసుకున్నాడని.. సినిమా చాలా బాగుందని టాక్ వినిపిస్తుంది. ఓవర్సీస్ నుంచి వస్తున్న టాక్ ప్రకారం చూస్తుంటే కచ్చితంగా మాస్ రాజా ముందు సినిమాలతో పోలిస్తే బెటర్ అంటూ టాక్ వినిపిస్తుంది. మరి ఈ తరహా వెరైటీ కథనంతో వచ్చిన రవితేజ మరో హిట్ అందుకుంటాడా లేదా చూడాలి. ఇప్పటికే వరుసగా డిజాస్టర్లు తన ఖాతాలో వేసుకున్న రవితేజ.. ఈ సినిమాతో తన విజయంతో తన కసి తీర్చుకుంటాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: