సినీ పరిశ్రమలో ఎంత గొప్ప హీరో అయినా కొన్ని సెంటిమెంట్స్ నీడలా ఫాలో అవుతుంటాయి.  కొన్ని సార్లు వాటి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి.  సాధారణంగా కొంత మంది హీరోలు తమ సినిమాలు పలానా నెలలోనే రిలీజ్ కావాలని అనుకుంటారు.. దానికోసం షెడ్యూల్స్ సైతం సెట్ చేసుకుంటారు.  మరికొంత మంది పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తారు.. ఇంకొంత మంది ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి బరిలో ఉండేలా చూస్తుంటార.  ఇదే సెంటిమెంట్ కొంత మంది దర్శక, నిర్మాతలకు కూడా ఉంది.  మాస్‌ మహరాజ్‌ రవితేజ హీరోగా విభిన్న సినిమా దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిస్కో రాజా నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఇప్పటికే ప్రీమియం షో టాక్ బయట రక రకాలుగా వస్తున్నాయి.

 

సక్సెస్‌ల వేటలో కాస్త వెనకబడిన రవితేజ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్లు, సాంగ్స్‌ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి.  మాస్ రాజా ముందు సినిమాలతో పోలిస్తే బెటర్ ఔట్‌పుట్‌తో వచ్చాడనేది వాస్తవం. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా.. ఒక్కక్ష‌ణం లాంటి భిన్న‌మైన సినిమాల తర్వాత విఐ ఆనంద్‌ చేసిన సినిమా ఇది..ఈయ‌న ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసాడు. నేల‌టికెట్టు నిర్మాత రామ్ త‌ల్లూరి ఈ మూవీ నిర్మించాడు. రవితేజ, బాబీ సింహా నటన సినిమాకు హైలైట్ అయిందని తెలుస్తుంది.

 

మరో టాక్ ప్రకారం ఈ మూవీ ఫస్టాఫ్ చాలా హైలెట్ గా ఉందని.. సెన్స్ ఫిక్షన్ నేపథ్యంతో చాలా  ఇంట్రెస్ట్ గా సాగిందని.. సెకండ్ ఆఫ్ కాస్త లాగే ప్రయత్నం దర్శకుడు చేశాడని.. ఇక్కడో కాస్త బోర్ ఫీలింగ్ ఉందని అంటున్నారు. అయితే కిక్2,బెంగాల్ టైగర్ లాంటి మూవీస్ ఫస్టాఫ్ బాగా ఎంట్రటైన్ మెంట్ తో సూపర్ అనిపించినా.. సెకండ్ ఆఫ్ సాగదీత.. కథలో పట్టు తప్పడం లాంటివి జరగడంతో ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేక పోయారు. మరి ఆ సెంటిమెంట్ ఈ మూవీకి ఉంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ రవితేజ మాత్రం తనకు బాగానే కలిసి వస్తుందన్న నమ్మకం తో ఉన్నట్లు టాలీవుడ్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: