తన అద్భుతమైన మాస్ ఎలిమెంట్స్ యాక్షన్ తో,  కామెడీతో ప్రేక్షకుల మాస్ మహారాజ గా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ.. తీసిన రెండు సినిమాలను విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించి  తన సినిమా వస్తుంది అంటే ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగించిన దర్శకుడు వీఐ  ఆనంద్... వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం డిస్కో రాజా. సైన్స్ ఫిక్షన్ సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి నుంచి రవితేజ అభిమానుల్లో  భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఇప్పటికే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విఐ ఆనంద్ డిస్కో రాజా సినిమాలో కూడా తన పనితనం చూపించాడు. సినిమా మొత్తం థ్రిలింగా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఆనంద్. 

 

 

 

 ఈ సినిమాలో దర్శకుడు విఐ  ఆనంద్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. విభిన్నమైన కథాంశం తో థ్రిల్లింగ్ గా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తిగా సినిమా సాగేలా తెరకెక్కించడంలో తాను దిట్ట అని నిరూపించుకున్నాడు. ఈ సినిమా నరేషన్  మొత్తం ఎంతో థ్రిల్లింగ్గా ఆకట్టుకునే విధంగా సాగుతూ ఉంటుంది. ఇక రవితేజ రెండు షేడ్స్ లో  అద్భుతమైన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేశాడు. అయితే తనదైన మాస్ ఎలిమెంట్స్ కామెడీ లేకపోయినప్పటికీ... కొత్త పంతాలో  రవితేజ యాక్షన్ తో అదరగొట్టేశాడు. రవితేజ కెరీర్ లోనే మొదటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సినిమా కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో డిస్కోరాజా పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.

 

 

 దర్శకుడు వి.ఐ ఆనంద్ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఒక్క క్షణం లాంటి రెండు సినిమాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇతర దర్శకులతో వేరు చేసే విధంగా ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్నారు. ఇక విఐ ఆనంద్ సినిమా వస్తుంది అంటే ఒక కొత్త ఫ్లాట్ లైట్ అన్నట్లుగా ప్రేక్షకుల్లో భావన ఉంటుంది. డిస్కో రాజా సినిమాను కూడా అలాగే సరికొత్త గత అంశాన్ని ఎంచుకుని ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు వి.ఐ ఆనంద్. ఫస్టాఫ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎన్నో ట్విస్టులతో ప్రేక్షకులందరిలో  తర్వాత ఏం జరుగుతుంది అని ఆసక్తిని కలిగిస్తూ సాగిపోతూ ఉంటుంది. అయితే సెకండాఫ్ కి వచ్చేసరికి ఫస్టాప్ లో  కొనసాగిన టెన్షన్ వాతావరణం మాత్రం తగ్గినట్లు కనిపిస్తోంది. సెకండాఫ్ లో  కూడా అదే టెంపో కొనసాగించి ఉంటే ఈ సినిమా రేంజ్ వేరబ్బా అన్నట్లుగా ప్రేక్షకులు భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: