మెగాస్టార్ రాజకీయాల నుండి తప్పుకుని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఇప్పటి వరకూ రెండు సినిమాలు చేశాడు. మొదటి సినిమా ఖైదీ నంబర్ ౧౫౦ ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. దాని తర్వాత స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి పాత్రలో నటించిన సైరా చిత్రం తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల అవతల ఎక్కువ ఆదరణ లేకపోయినప్పటికీ ఫర్వాలేదులే అనిపించింది.

 

 

అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఎంతో కాలంగా త్రివిక్రమ్ తో మెగాస్టార్సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఎప్పటికైనా త్రివిక్రమ్ తో మెగాస్టార్ సినిమా చేస్తే చూడాలనేది మెగా ఫ్యాన్స్ కోరిక. అయితే భవిష్యత్తులో ఆ కోరిక తీరేలానే ఉంది. మెగాస్టార్ కి త్రివిక్రమ్ గతంలో ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట.

 

 

త్రివిక్రమ్ చెప్పిన ఆ లైన్ చిరంజీవికి నచ్చిందని టాక్. అయితే త్రివిక్రమ్ ఆ లైన్ పై ఆల్ రెడీ కొంత వర్క్ చేశాడని.. రానున్న రెండు సంవత్సరాలలో ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రానుందనే వార్త, ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి చేసే సినిమా ప్యూర్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు. త్రివిక్రమ్ సినిమా అంటే.. ఎమోషన్ అండ్ యాక్షన్ తో పాటు హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే.

 

కామెడీ పండించాలంటే మెగాస్టార్ ని మించిన వారు లేరనే చెప్పాలి. కాబట్టి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే అది మరో రేంజ్ లో ఉంటుందని ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న త్రివిక్రమ్ తన తర్వాతి సినిమా ఎన్టీఆర్ తో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి చిరంజీవి,  త్రివిక్రమ్ లు కలిసేదెప్పుడో...?

మరింత సమాచారం తెలుసుకోండి: