వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి హిట్ అందుకున్నాడు. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అప్పతి వరకు మహేష్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిల్చిన మహర్షి సినిమాని పక్కకి నెట్టేసింది. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది.

 

 

అయితే అనిల్ రావిపుడి కెరీర్లో ఇది ఐదవ చిత్రం. ఐదవ చిత్రానికే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో వర్క్ చేసిన అనిల్ తర్వాతి సినిమా ఎవరితో చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు లాంటి హిట్ అందించిన దర్శకుడితో ఏ స్టార్ హీరో అయినా సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. మరి అనిల్ ఎవరితో చేస్తాడనే ప్రశ్న మొదలైంది. సాధారణంగా స్టార్ హీరోలతో సినిమాలు చేసినవాళ్ళు చిన్న హీరోలతో సినిమా చేయడానికి ఆసక్తి చూపరు.

 

 

మళ్ళీ స్టార్ హీరోతోనే సినిమా చేసేందుకు తహతహలాడతారు. మరి సూపర్ స్టార్ తో చేసిన అనిల్ తర్వాతి సినిమా ఏ స్టార్ హీరోతో ఉంటుందోనని అనుకుంటున్నారు.  అయితే ఎఫ్ 2 సినిమా సక్సెస్ అనంతరం ఎఫ్ ౩ ని కూడా తెరకెక్కిస్తానని అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే.. ఈ స్క్రిప్టు మీద పనులు కూడా జరుగుతున్నాయట. మరి అనిల్ ఎఫ్ 3 నే తెరకెక్కిస్తాడా లేదా మరో స్టార్ హీరోతో సినిమా మొదలెడతాడా అన్నది చూడాలి.

 

ఎఫ్ 3 సినిమా వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోగానే తీస్తాడనే ప్రచారం కొనసాగింది. అదే నిజమైతే ప్రస్తుతానికి ఆ ఇద్దరు హీరోలు వారి వారి సినిమాల్తో బిజీగా ఉన్నారు. మరి ఈ గ్యాప్ లో అనిల్ మరో స్క్రిప్టుతో మరో హీరోతో సినిమా చేస్తాడని అంటున్నారు. ఏ విషయం మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: