చెన్నై బ్యూటి త్రిష టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కృష్ణ, అతడు, స్టాలిన్, నమో వేంకటేశ.. ఇలా పలు సూపర్ డూపర్ సినిమాల్లో నటించిన త్రిష. ఈమె సినీ కెరీర్లో తెలుగు, తమిళంలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన ఘనత ఆమెది. పరిశ్రమలో పోటీని తట్టుకుంటూ ఇంత లాంగ్ పీరియడ్ సక్సెస్ పుల్ గా కెరీర్ కొనసాగించడం అంటే మామూలు విష‌యం కాదు. కాని, త్రిష అది చేసి చూపించింది. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ కెరీర్ సాగిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటి త‌న పెళ్లిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.  సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన హీరోయిన్ త్రిష.. తనకు ఎదురైన ప్రశ్నలకు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చింది. తనకు కూడా కొన్ని కలలు ఉన్నాయని పేర్కొంది. వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో తనకు నచ్చిన మగాడు దొరికి, పెళ్లంటూ చేసుకుంటే వెగాస్ లోనే చేసుకుంటానని, అదే తన డ్రీమ్ లిస్ట్ లో ఉన్న క్రేజీ డ్రీమ్ అని వెల్లడించింది.

కాగా, గ‌తంలో వరుణ్ అనే వ్యక్తితో డేటింగ్ చేసిన త్రిష అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఏం జరిగిందో ఏమో ఇద్దరూ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. దీనికి కారణం మాత్రం వెల్లడించలేదు. పెళ్లి తరువాత కూడా నటిస్తానని చెప్పడంతో వరుణ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడనే ప్రచారం కోలీవుడ్ లో జ‌రిగింది. ఇక ఆ త‌ర్వాత త్రిష పెళ్లి టాపిక్ ఎక్కడా రాలేదు. అయితే ఇప్పుడు త్రిష పెళ్లిపై ఈ విష‌యాలు బ‌య‌ట‌పెట్టడంతో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పొన్నియిన్‌ సెల్వన్‌', మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం, మోహన్‌ లాల్‌ తో 'రామ్‌' సినిమాలతో బిజీగా ఉన్న త్రిష‌.

మరింత సమాచారం తెలుసుకోండి: