టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ఆలోచనలకు తగ్గట్టే ఉంటాయి ఆయన చేసే సినిమాలు. వయసు కనబడనివ్వని ఆయన మనసుకు నచ్చిన సినిమాలే చేసుకుంటూ వెళుతూంటాడు. గతేడాది వచ్చిన మన్మధుడు2 సినిమానే ఇందుకు నిదర్శనం. అందుకే యాక్టివ్ గా ఉండే రోల్స్ ను ఎంచుకుంటూ నేటి తరానికి ఏం తీసిపోనని నిరూపిస్తూంటాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న వైల్డ్ డాగ్ సినిమా కూడా అలాంటిదే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఆ సినిమాలో నాగ్ ఎన్ఐఏ ఆఫీసర్ గా చేస్తున్నాడు.

 

 

ఇప్పుడీ సినిమాపై ఓ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ ఆమధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరనేది ఇంతవరకూ యూనిట్ రివీల్ చేయలేదు. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో నాగ్ సరసన్ హైదరాబాదీ దియా మీర్జా నటిస్తోందని సమాచారం. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన దియా మీర్జా హీరోయిన్ గా అందరికీ సుపరిచితమే. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారింది. దియా మీర్జా 2000వ సంవత్సరానికి మిస్ ఆసియా పసిఫిక్ భారత్ తరపున గెలిచింది.

 

 

అదే ఏడాది మిస్ యూనివర్స్ గా లారా దత్తా, మిస్ వరల్డ్ గా ప్రియాంక చోప్రా.. వీరు ముగ్గురూ కిరీటాలు గెలుచుకుని అందాల పోటీల్లో ప్రపంచంలో భారత్ పేరు ఘనంగా చాటారు. వైల్డ్ డాగ్ సినిమాను కొత్త దర్శకుడు సోలోమన్ తెరకెక్కిస్తున్నాడు. నాగార్జున పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు. సినిమా కథ, కథనంలో వైవిద్యం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మంచి పేరున్న టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. దియా మీర్జాపై వస్తున్న వార్తలపై యూనిట్ స్పందించాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: