టాలీవుడ్ లో రవితేజ అంటే ఎనర్జీ.. ఎనర్టీ అంటే రవితేజ అనే టాక్ ఉంది.  అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ తర్వాత వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్’ మూవీతో హీరోగా మారిన రవితేజ మాస్ మహారాజు గా ప్రేక్షకుల మనసు దోచాడు.  రాజమౌళి దర్శకత్వంలో ‘విక్రమార్కుడు ’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఈ మూవీతో విక్రమ్ రాథోడ్ గా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తే.. అత్తిలి సత్తి అనే చిలిపి దొంగగా మరో పాత్రలో నటించి కడుపుబ్బా నవ్వించారు.  యాక్షన్, సెంటిమెంట్,కామడీ ఏదైనా తనదైన మార్క్ చాటుకుంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు రవితేజ.  

 

రవితేజ మూవీస్ అంటేనే ఒక ఎనర్జీ అనే స్థాయికి తీసుకు వచ్చాడు.  తాజాగా ఎక్కడికి పోతావు చిన్న‌వాడా, ఒక్కక్ష‌ణం లాంటి భిన్న‌మైన సినిమాల తర్వాత విఐ ఆనంద్‌ దర్శకత్వంలో మరో డిఫరెంట్ స్టైల్ సైన్స్ ఫిక్షన్ మూవీ నేపథ్యంలో ‘డిస్కోరాజా’ తెరకెక్కించారు.  ఈ మూవీలో రవితేజ డిఫరెంట్ షడ్స్ లో కనిపించారు. ఈయ‌న ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసాడు. నేల‌టికెట్టు నిర్మాత రామ్ త‌ల్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. రవితేజ, బాబీ సింహా నటన సినిమాకు హైలైట్ అయిందని తెలుస్తుంది. రవితేజ సరసన  పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్,  తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు.

 

ముఖ్యంగా డిస్కో రాజా పాత్రలో రవితేజ నటన సినిమాకు హైలైట్. ఈ చిత్రంలో మాస్ రాజా డ్యూయల్ రోల్ చేసాడు. తన కెరీర్‌లో ఇప్పటి వ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త జోన‌ర్‌లో ఈ మూవీ ట్రై చేసాడు ర‌వితేజ‌.  సైన్స్ ఫిక్షన్ లో వచ్చిన కాన్సెప్ట్ ఓకేగా ఉందని టాక్ వస్తుంది. ఇక రవితేజ ఎనర్జీ పరవాలేదు అనిపిస్తుంది.. మరి సినిమా రిజల్ట్ సాయంత్రం వరకు ఎలా ఉంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: