తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు వచ్చారు.. కానీ తనదైన యాంకరింగ్ స్టైల్ తో ఎవరినైనా మంత్ర ముగ్దులను చేయగల వాగ్ధాటి గల యాంకర్ ఎవరంటే వెంటనే చెప్పేస్తారు సమ కనకాల.  వాస్తవానికి ఆమెది కేరళా అయినా... హైదరాబాద్ లో సెటిల్ కావడంతో తెలుగు పై మంచి పట్టు సాధించారు. ప్రస్తుతం సుమ యాంకర్ గానే కాకుండా స్టార్ హీరోల ఈవెంట్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  ఒకదశలో ఆమె లేకుంటే అసలు ఆ ఈవెంట్ జరుగుతుందా అన్న అనుమానాలు కూడా వచ్చేస్థాయికి సుమ అభిమానం సంపాదించారు.  

 

ఇప్పటి వరకు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు సుమ యాంకరింగ్ గా వ్యవహరించారు.. వ్యవహరిస్తున్నారు. తాజాగా యాంకర్ సుమ ఎలాంటి మేకప్ లేకుండా అందరినీ ఆశ్చర్య పరిచారు.  టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ ఇలా ఏ కార్యక్రమమైనా సుమా ఉండాల్సిందే. వరుస పంచ్ డైలాగ్స్, జోక్స్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. దర్శక, నిర్మాత,సినీ హీరో, హీరోయిన్లను స్టేజ్ పై తనదైన కామెడీ టైమింగ్ తో అలరిస్తుంటారు సుమ. ఇప్పటి వరకు టాలీవుడ్ కి ఎంతమంది యాంకర్లు వస్తున్నా.. సుమని ఎవరూ బీట్ చేయడం లేదు.

 

తాజాగా సుమ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోల సుమ ఎలాంటి మేకప్ లేకుండా కనిపిస్తుంది.  'నా ఉదయాలు ఇలాగే ఉంటాయి. మేకప్ లేకుండా నా శరీరం శ్వాస తీసుకుంటోంది' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక వీడియోలో తనకు క్యాష్ షోలో కాలేజ్ స్టూడెంట్స్ ఇచ్చిన పెయింటింగ్ ని చూపిస్తూ.. వారి అభిమానానికి థాంక్యూ చెప్పింది. అంతే కాదు మీకోసం ఇంకా ఎన్ని పనులైనా చేస్తాను.. ఎనర్జీగా ఉంటానని అన్నారు. యుద్దానికెల్తాం పదండి... తన మేకప్ మెన్ ని పిలుస్తూ.. వీడియో ముగించింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Good mornings are like this .my skin breathing . No makeup.. Thanku @vivekvardhini pg college @vasuads Thanks to @ramesh_makeovers @makeupby_sathya for no makeovers 🤪

A post shared by suma Kanakala (@kanakalasuma) on

మరింత సమాచారం తెలుసుకోండి: