టాలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్ హరీష్ శంకర్ ఎప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా ఉంటాడు. తెరకెక్కించే సినిమాల విషయంలో కూడా హరీష్ శంకర్ ఈ విధంగానే వ్యవహరించడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. దువ్వాడ జగన్నాథం సినిమా విషయంలో అదేవిధంగా గద్దలకొండ గణేష్ సినిమా విషయంలో హరీష్ శంకర్ వ్యవహరించిన తీరు అనేకమందిని కోపం తెప్పించే విధంగా ఉండగా ఇటీవల క్రైస్తవ పాటల ను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ పెను దుమారాన్ని రేపింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఆయనను మహేష్ మరియు బన్నీ అభిమానులకు టార్గెట్ చేసే విధంగా మారింది. మేటర్ లోకి వెళితే ఇటీవల ఆయన ట్విట్టర్లో

"నేనూ గెలవాలి ....All the Best

నేను గెలవాలి .... Ok..... 

నేనే గెలవాలి .... Sorry Boss....'' 

 

అని పోస్ట్ చేశారు. దీంతో ఇండస్ట్రీలో ఇది ఎవరినీ ఉద్దేశించి పెట్టడాన్ని తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఎక్కువమంది సంక్రాంతి పండుగకు సినిమాలు ఇటీవల విడుదలైన నేపథ్యంలో ఫేక్ కలెక్షన్ల గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్న సందర్భంలో కావాలని హరీష్ శంకర్ సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాల కలెక్షన్లను ఉద్దేశించి వేసిన సెటైర్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. దీంతో బన్నీ మరియు మహేష్ బాబు అభిమానులు హరీష్ శంకర్ ని టార్గెట్ గా చేసుకుని ఆయన చేసిన ట్వీట్ పట్ల సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా ఇద్దరు హీరోల అభిమానులు ఒకరిపై మరొకరు కూడా కామెంట్ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమో.. బన్నీపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ ట్వీట్ కింద ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకుంటూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది మాత్రం అసలు ఈ ట్వీట్ అర్ధమేంటని అడుగుతున్నారు. దీంతో హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకసారి హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: