'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ వంటి ముగ్గురు గ్లామర్ బ్యూటీస్ హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ సినిమా డిస్కోరాజా. ఈ సినిమాని రవితేజ ఎనర్జీకి తగ్గట్టు తెరకెక్కించామని మేకర్ ముందునుంచి చెబుతున్నారు. దాఇనికి తోడు ఈ సినిమా నుండి రిలీజైన టీజర్స్.. లిరికల్ సాంగ్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వాస్తవంగా రవితేజ ఈమధ్య నటించిన సినిమాలు సరిగా మెప్పించలేకపోయినప్పటికి ఆ ప్రభావం 'డిస్కోరాజా' సినిమాపై ఏమాత్రం కనిపించడం లేదు. అందుకే మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం థియోటర్స్ లోకి వచ్చింది. 

 

అయితే మాస్ రాజా నుంచి ఫ్యాన్స్ గాని కామన్ ఆడియన్స్ గాని ఆశించిన అంశాలు ఏవీ లేవట. ఫస్టాఫ్ చూస్తున్నంత సేపు అసలు ఏమి జరుగుతుందో కూడా అర్థం కావడం లేదట అంతేకాదు ఇంట్రవెల్ అయింది కూడా తెలీడం లేదట ప్రేక్షకులకు. మంచి ప్రి రిలీజ్ బిజినెస్ తో పాటు శాటిలైట్ బిజినెస్ కూడా బాగా జరగడంతో మాస్ రాజా సినిమా మీద జనాలు గంపెడు ఆశలు పెట్టుకొని థియోటర్స్ కి వెళ్తే బయటకు వచ్చేసరికి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయట. సెకండాఫ్ లో ఏముందో వెతుక్కునే పరిస్థితి ఉందని అంటున్నారు. క్లైమాక్స్ ఏదో గొప్పగా ఉంటుందనుకుంటే చప్పగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. అసలి ఇది మాస్ రాజా సినిమానేనా అన్న అనుమానం కలుగుతుందట కొందరికైతే.

 

ఇక అందరు బాగా డిసప్పాయింట్ అవుతుంది థమన్ విషయంలో. ఇప్పటి వరకు రవితేజ-థమన్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్, కిక్, బలుపు, పవర్ ..వంటి సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంతేకాదు రీసెంట్ గా అల వైకుంఠపురములో సినిమాకి థమన్ మ్యూజిక్కే పెద్ద మ్యాజిక్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి పెద్ద కారణం అయింది. ఇదే విషయాన్ని సక్సస్ ఈవెంట్ లో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రం ఓపెన్ గా చెపారు. 'అల' సక్సస్ క్రెడిట్ ఎక్కువగా థమన్ కే ఇచ్చారు. దాంతో రవితేజ మ్యూజిక్ పరంగా తమన్ డిస్కోరాజ సినిమాకి మ్యాజిక్ చేస్తాడనుకుంటే ఛీ..ఛీ అనిపించుకేలా ఇచ్చాడని అంటున్నారు. ఇక మ్యూజిక్ విషయంలో రవితేజ కూడా బాగా డిసప్పాయింట్ అవుతున్నాడట. మంచి సినిమాలిచ్చావని డిస్కోరాజ్ నీ చేతిలో పెడితే నాకించేశావ్ అన్నట్టుగా ఫీలవుతున్నాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: